Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.01.2023
Share:

By Village Missionary Movement

Friday, 06-Jan-2023

దిన ధ్యానము(Telugu) 07.01.2023

 

అంశం:- ట్యూషన్ పరిచర్య.

 

"ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు" - కీర్తనలు 22:30

 

తన రెండు కాళ్ళు పనిచేయని వికలాంగురాలు కావడంతో తన సహోదరులు మరియు స్నేహితుల సహాయంతో దక్షిణ తమిళనాడులో అనేక విద్యాసంస్థలను అభివృద్ధి చేయుటకు కారణం సారల్ తక్కర్. వంటిటిలో పని చెయ్యాల్సిన ఆడపిల్లలకు విద్య ఎందుకు అనుకున్న ఈ సమాజంలో గల స్థితిని తమ సహోదరుడు వ్రాసిన ఉత్తరం ద్వారా తెలుసుకున్న యవ్వన బాలిక అయిన సారల్ తక్కర్ వికలాంగురాలు అయినప్పటికీ తన నగలను అమ్మి అనేకమంది సహాయమును తీసుకొని లక్షల కొలది ఆడపిల్లలు విద్యాభ్యాసం పొందుకొనుటకు సహాయం చేసారు. అది మాత్రమే కాదు మరణము వరకు మన దేశం పై ఆశక్తి గలవారై యున్నారు. ఆమె నిర్వహించిన విద్య సంస్థలు ద్వారా అనేక లక్షల మంది విద్యాభ్యాసం పొందుకోవడంతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు ను కూడా తెలుసుకున్నారు. వారిలో అనేకులు సమాజంలో ఉత్తమమైన నాయకత్వపు బాధ్యతల్లో ఉన్నారు అనే విషయం కాదనలేని విషయం. ఒక వికలాంగురాలైన స్త్రీ యొక్క ఆశక్తి సమాజంలో ఎంతటి మార్పును తీసుకొని వచ్చిందో చూసారా! సారల్ తక్కర్ వలె పరిశుద్ధ గ్రంధంలో దేవుడు అనేకులకు ఏర్పరుచు కొన్నది వారి యొక్క అర్హతలను బట్టి కాదు. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులను ఉదాహరణగా తీసుకుందాం. నా వెంబడి రండి నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేసెదను అని చెప్పిన ఆయన మాటకు లోబడి ఆయనను వెంబడించారు. జరిగినది ఏమిటి ప్రతి ఒక్కరు లోకాన్ని కదిలించి సేవకులుగా మారారు. విద్యాభ్యాసం లేని పేతురు చేసిన మొదటి ప్రసంగం లోనే 3000 మంది ప్రభువైన యేసుక్రీస్తు ను సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎవరు కూడా తమకు తామే ఏ అర్హత లేదు అని యేసుక్రీస్తు యొద్ద సమర్పించు కొన్నట్లు అయితే ఆయన వారిని అర్హులుగా చేసి హెచ్చిస్తారు. కాబట్టి మనం కూడా మన అర్హతను చూడకుండా దేవుని హస్తాలలో సమర్పించు కొని ముందుకు సాగినట్లు అయితే ఒక సమూహాన్ని నడిపించే నాయకునిగా మారగలం. ఎలా అని అనుకుంటున్నారా? తమ చిన్న వయస్సులో ఏది తప్పో ఏది ఒప్పో అని ఎరుగకుండా మనస్సుకు నచ్చిన విధముగా జీవించే పిల్లలు ఎక్కువ అయిపోయారు. వీరిని ఐక్య పరచి దేవుని ప్రేమను వివరించి చిన్న చిన్న సహాయలు చెయ్యడమే ఈ ట్యూషన్ సెంటర్. మీరు దీనిని మీ గ్రామాల్లో ఏర్పాటు చేయవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు. మనం అందరం నాయకులను అభివృద్ధి చేసే పనిలో పాలు పొందగలం అనేది మరచిపోవద్దు. విద్య ఒకరి జీవితము యొక్క నాణ్యతను వివరిస్తుంది. అది దేవుని ప్రేమతో నేర్పించి నట్లయితే కచ్చితంగా ఆ పిల్లలు దేవుని సంతతి వలె మరియు ఒక శిష్యుని వలె ఎదుగుతారు. మన పరిచర్యలో 12 స్థలాల్లో ట్యూషన్ సెంటర్ల ను ఏర్పాటు చేసాము. ఇందులో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రార్ధించండి. మీ స్థలాల్లో మీరు కూడా ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకు రండి. మీరు ఏర్పాటు చేసిన ట్యూషన్ సెంటర్ లో 12 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అయితే మీరు 12 మంది నాయకులను అభివృద్ధి చేస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొనండి. 

- శ్రీమతి. మంజులా గారు.

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో ఉన్న హాస్పిటల్ కి చికిత్స కోసం వస్తున్న ప్రతి ఒక్కరు యేసయ్య ను రక్షకునిగా అంగీకరించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al