Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.01.2023
Share:

By Village Missionary Movement

Thursday, 05-Jan-2023

దిన ధ్యానము(Telugu) 06.01.2023

 

అంశం:- సమస్తము క్రొత్తవాయెను. 

 

"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను" - 2 కోరింథీయులకు 5:17

 

నూతన సంవత్సరం వచ్చింది. మనం కొత్త కొత్త వాగ్దానములను మరియు ఆశీర్వాదాలను ఆశిస్తాం. గత సంవత్సరం వాగ్దానం నెరవేరిందా? దానిని పొందుకొనుటకు గల ఆజ్ఞలను మనము పొందుకున్నామా అని కొన్ని నిమిషాలు ఆలోచించిన తరువాత నూతన సంవత్సరం లోనికి వెలితే బాగుంటుంది. 

 

మనం ఒక కొత్త ఇల్లు కట్టి అందులోనికి వెళ్లినప్పుడు అనవసరమైన వస్తువులను, వాడని వస్తువులను పనికిరాని దుస్తులను కచ్చితంగా తీసుకొని వెళ్ళము. కొత్త సోఫా, కొత్త ఫ్రిఙ్, కొత్త టేబుల్ ఇలా అన్ని కొత్తవి తీసుకొని వెళతాం. క్రీస్తుని ఎరుగక ముందు మన హృదయంలో గల అనవసరమైన ఆలోచనలు, గర్వపు ఆలోచనలు, అసూయలు, చెడు ఆలోచనలు, చెత్త కుప్ప వంటి పగలు, సమస్తమును తీసి పడేసి క్రీస్తు నందు నూతన ఆలోచనలను, నూతన సంతోషమును, సమాధానము, దీర్ఘ శాంతమును తీసుకొని వెళదాం. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి యుండుడి అని ఫిలిప్పి 2:5 చెబుతుంది. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. 

 

దీనికి ఉదాహరణగా గ్రద్దను తీసుకుందాం. గ్రద్ద మిక్కిలి బలమైన పక్షి అయిననప్పటికి తన వృద్ధాప్యంలో రెక్కలను ఊడదీసి, కాళ్ళ గోళ్లను అధికముగా తనకు తానే గాయపరుచు కొంటుంది. కొన్ని రోజుల తరువాత రెక్కలు, కాళ్ళ గోళ్లు కొత్తగా వచ్చి నూతనంగా అభివృద్ధి చెందుతుంది. ఈవిధంగా తనను తాను నూతన పరచుకొంటుంది. 

 

ప్రియమైన వారలారా! గ్రద్ద వలె మనము కూడా పాత పాపములను మరియు పాపపు ఆలోచనలను విడిచిపెట్టి నట్లైతే యేసుక్రీస్తు మనలను నూతన పరచి మన జీవితమును హెచ్చిస్తారు. క్రీస్తులో నిజమైన మారుమనస్సు, మార్పు కలిగితే నూతన సృష్టిగా మారతాము. తప్పులు మరియు పాపముల వలన మనస్థాపం చెంది దేవుని చెంతకు వస్తే ఆయన మనలను ఆయన రక్తం ద్వారా కడిగి మనలను నూతన పరుస్తారు. దీనిని చదువుతున్న మీరు కూడ నూతన పరచబడి నూతన సృష్టిగా మారి దేవుని యొద్ద ఆశీర్వాదాలు పొందుకొనండి. ఇతరులకు ఆశీర్వాదకరముగా మారండి. ఆమెన్.

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు.

 

ప్రార్థన అంశం:-

నూతనంగా ప్రారంభించబడిన 24 గంటలు టీ. వి ఛానెల్ ఆమెన్ విలేజ్ టీవీ అనేక లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాదకరముగా వుండులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al