Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.01.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 04-Jan-2023

దిన ధ్యానము(Telugu) 05.01.2023

 

అంశం:- నేను చేయగలిగినది మాత్రమే ఇచ్చాను.

 

"నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన దానింజ్ సంపాదించితిని" – 1 దినవృత్తాంతములు 29:2

 

ఇటీవల పరిచర్య కొరకు గుంపుగా ఉన్న ఒక గ్రామమునకు వెళ్ళాము. అది ఒక కొండ ప్రాంతము. అక్కడ కొంత మంది స్త్రీలు ప్రార్థన చేయుటకు అక్కడికి వచ్చారు. పాటలు పాడి, వాక్యమును ధ్యానించి ప్రార్ధనతో ఆ కార్యకమాన్ని ముగించాము. ఆ గ్రామము విడచి బయలు దేరినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలలో ఒక ఆమె నాయొద్దకు వచ్చి సార్ మా కుటుంబంలో గల పేదరికం మారాలి మా కొరకు ప్రార్ధించండి అని అడిగింది. నేను ప్రార్దించి ముగించిన వెంటనే కానుక ఇచ్చింది. నేను వద్దు అని చెప్పిన గాని 100 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇందులో కానుక ఇవ్వడానికి ఇంకొక విషయం ఏమిటి అంటే మరొకరి యొద్ద అప్పు తీసుకున్నది. అదే ఇక్కడ గమనించ వలసిన ప్రముఖ్యమైన విషయం. 

 

2 కోరింతి 8:1-5 వచనాల్లో మాసిదోనియా సంఘంలో గలవారు వారు శ్రమలతో, నిరుపేదరికముతో శోధింప బడినప్పటికి సేవకులకు ఉత్సాహంగా కానుక ఇచ్చారు అని మనం చదువుతున్నాం. ఇచ్చుటకు మీ యొద్ద ఎంత ఉన్నది అనేది ప్రాముఖ్యం కాదు బదులుగా మీ హృదయంలో నా శక్తీ కొలది ఇస్తాను అనే ఆశ ఉన్నట్టు అయితే మనం దేనినైనా చేయగలం. సమస్త విధములైన కృపను ఇచ్చే దేవుడు మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించిన కృపను మనకు అనుగ్రహించును గాక! 

 

క్రీస్తులో ప్రియమైన వారలారా! ఈనాటి ధ్యానంలో ఒక ప్రాముఖ్యమైన విషయమును గూర్చి దేవుడు మీతో మాట్లాడాలి అని ఆశ పడుతున్నారు. దేవుని పనికి సహాయం చేయుటలో మనలో ప్రశ్నలు, సణుగులాటలు ఉన్నట్లు అయితే సేవకొరకు ఎవరు సహాయం చేస్తారు. సేవకొరకు ఇచ్చుటకు మన హృదయం మరియు మన చేతులు ముందుకు రావాలి. కోరింధి సంఘ ప్రజలు యొద్ద డబ్బులు ఉన్నప్పటికీ ఇచ్చుటకు మనస్సు లేక యున్నారు. కాని ఇచ్చుటకు ఏమి లేని మాసిదోనియా సంఘం వారు వారి చేత నైనంత వరకు సహాయం చేసారు. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం పరిచర్యకు వెళ్లకపోయిన మనం చేయగలిగినంత వరకు సేవకులకు సహాయం చేయడం మంచిది. పరలోకంలో మీకు నిధి ఉంచబడుతుంది. ప్రభువు మిమ్మును నడిపించును గాక! ఆమెన్.

- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

సంఘములు లేని గ్రామాల్లో సంఘములు కట్టుటకు దేవుడు ఇచ్చిన దర్శనములో అనేకులు మనతో ఐక్య పడులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al