Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.01.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 04-Jan-2023

దిన ధ్యానము(Telugu) 04.01.2023

 

అంశం:- శాంతి సభ.

 

"సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను" - మత్తయి 8: 16-17

 

దక్షిణ జిల్లాలో గల ఒక గ్రామంలో సువార్త పరిచర్యకు వెళ్ళాను. అక్కడ ఒక మతం వారు వెంబడిస్తూ పూజించే ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలో చాలా కాలంగా రోగాలతో బాధపడే వారు మరియు దయ్యముల చేత పట్టి పీడింపబడేవారు సంకెళ్లుతో బంధింపబడి వున్నారు. ఈ స్థలానికి వచ్చి మొక్కితే స్వస్థత కలుగుతుంది అనే ఒక నిజమైన నిరీక్షణ అక్కడ ఉన్న వారిలో ఉండేది. కాని వారి నిరీక్షణ నెరవేరలేదు అనేదే నేను తెలుసుకున్న నిజం. దానిని చూసినప్పుడు ఆత్మలో భారం కలిగి ప్రార్ధించడం మొదలుపెట్టాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడడు. ఈ విధముగా బాధింప బడుతున్న వారి కొరకు శాంతి సభ అనే సేవా ప్రణాలికను ఇచ్చారు. గడిచిన 26 సంవత్సరాలుగా గ్రామాల్లో సువార్తను చేస్తూ వస్తున్నాం. బీదలకు సువార్త ప్రకటించ బడుచున్నది అని పరిశుద్ద గ్రంధం సెలవిస్తుంది. కాని అదే సమయంలో దయ్యములు పట్టిన వారిని, నయం కాని వ్యాధులతో బాధపడేవారిని చూసినప్పుడు అక్కడ చిన్న ప్రార్థన మాత్రమే చేయగలుగుతున్నాం. ఇలా బాధింప బడుచున్న వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్దించి విడుదల పొందుకొనుటకు ప్రయాస పడినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు. వారిని 10 రోజులు మాతో పాటు ఉండనిచ్చి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వారి కొరకు ప్రార్ధించ మని పరిశుద్ధ గ్రంధం నుండి కొన్ని సలహాలు ఇవ్వాలి అని అనుకున్నాం. ఈ విధంగా బాధింప బడి ఉన్న ప్రజల కొరకు క్యాంపస్ లో ప్రతి రోజు ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాం. ఇప్పుడు ఈ ప్రణాళిక ప్రకారముగా ఒక చిన్న గృహం మరియు చిన్న చిన్న గదులను నిర్మిస్తూ వస్తున్నాం. ఎలాగైనా ఒక సమూహము వారిని దేవుని కొరకు ఆదాయం చేసే పనిలో శాంతి సభ కూడా తన పనిని చక్కగా నెరవేర్చుతూ వస్తుంది. ఈనాటి ధ్యానం లో అవసరతలు ఉన్న ప్రజల కొరకు దేవుని సహాయంతో మన శక్తి కొలది చేయుటకు ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. మంచిగా ప్రార్ధించే వారు ఉపవాసం ఉన్న వారు ఈనాడు దేవుని పనికి అధికముగా అవసరమై యున్నారు. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను వదిలి పోవుట అసాధ్యం అని యేసుక్రీస్తు చెబుతున్నారు. గ్రామాల్లో ఈవిధమైన పోరాటాల్లో చిక్కుకొని ఉన్న ప్రజలకు ప్రార్ధించి విడుదల ఇచ్చుటకు ముందుకు రండి కలిసి పనిచేద్దాం. ప్రభువు మనలను నడిపించును గాక! ఆమెన్.

- బ్రదర్. కె. డేవిడ్ గణేషన్ గారు.

 

ప్రార్థన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనుల యొక్క అవసరతలు సందించ బడేలా ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al