By Village Missionary Movement
Monday, 02-Jan-2023దిన ధ్యానము(Telugu) 03.01.2023
అంశం:- ఇంకా పన్నెండు నెలలు.
"అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు" - యోనా 2:8
క్రీస్తులో మిక్కిలి ప్రియమైన వారలారా! ఈ నూతన సంవత్సరం లోనికి ప్రవేశించిన మనం ఈ సంవత్సరంలో గల పన్నెండు నెలలను దేవుని యొద్దనుండి కృపతో పొందుకున్న మనం ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం. అయితే రేపటి దినమును గూర్చి అతిశయ పడకుము ఏ దినమున ఏమి సంభవించునో మీకు తెలియదు అని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది. కాబట్టి ప్రతి రోజు దేవుని సన్నిధిలో మనలను మనం సమర్పించు కొని కాపాడుకుందాం.
దానియేలు జీవించిన కాలంలో రాజగు నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్న కాలంలో ఆయన ఇక దర్శనమును. చూసి భయపడ్డాడు. ఆ సమయంలో యెహోవా దానియేలు మూలముగా ఆ దర్శనమునకు అర్థం తెలియ జేస్తారు. ఆ అర్థమునకు చివరిలో విధ్వంసము తెప్పించు కొనుటకు దానియేలు నుండి ఒక సలహా ఇవ్వబడుతుంది. అదేమనగా నీతిని జరిగించి దీనులను కనికరించి తమ యొక్క పాపములను తొలగిస్తే వారి యొక్క నాశనము తొలగును అనేదే ఆ సలహా. కాని ఆ సలహా ఇచ్చినప్పటికి పన్నెండు నెలలు ఆయన కృపా కాలమును గ్రహించ కుండా వృధా చేశారు. అది మాత్రం కాకుండా బబులోను అనే ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ఘనతను కనపరుచుటకై రాజధాని నగరముగా నేను కట్టించినది కదా? అని దేవునికి విరోధముగా గర్వముగా మాట్లాడి ప్రజల ద్వారా త్రోసివేయబడ్డాడు నెబుకద్నెజరు. అతనికి ఉన్న రాజ్య భారము కూడా తొలగించ బడింది.
దీనిని చదువుతున్న ప్రియమైన దేవుని పిల్లలారా! మీలో ఉన్న చిన్న చిన్న లోటులను తొలగించి ఆయన చిత్తం మీలో నెరవేర్చి మీ యొక్క జీవితము సంవృద్దిగా మార్చుకొనుటకు హెచ్చరికలతో కూడిన వాగ్దానములను సొంతం చేసుకోనుటకు ఇంకా పన్నెండు నెలలు మీకు ఇవ్వబడి ఉన్నవి.
దేవుడు ఇచ్చిన ఈ అవకాశమును ఉపయోగించుకొని ఆయన కొరకు మహిమ గల కార్యాలు చేసి సంవృద్ది గల జీవితమును సొంతం చేసుకో బోతున్నారా? లేదా నెబుకద్నెజరు రాజు వలె కృపా కాలం వృధా చేసుకొంటారా?
- బ్రదర్. కె. బెంజమిన్ గారు.
ప్రార్థన అంశం:-
యూత్ మీటింగ్ ద్వారా సంధింప బడుతున్న యవ్వనులు దేవుని కొరకు ఉత్సాహంగా లేచి కార్యం జరిగించు లాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250