Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.01.2023
Share:

By Village Missionary Movement

Monday, 02-Jan-2023

దిన ధ్యానము(Telugu) 02.01.2023

 

అంశం:- శక్తి కొలది చేద్దాం.

 

"ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను" - మార్కు 14:8

 

మా ఇంటికి సమీపంలో 80 సంవత్సరాల వయస్సు గల వృద్ధ తల్లిగారు వుండేవారు. ఆమె చేతికి గల 2 వ్రేళ్లు మాత్రమే పనిచేస్తాయి. కాని ఆమె అ చేతులతో చక్కగా పత్రికలను వ్రాసేవారు. అవసరమైన వారి యొక్క చిరునామాను సేకరించి సువార్త పత్రిక అయిన యోహాను పుస్తకమును పంపించే వారు. ఇది ఆమెకు చాలా కాలంగా అలవాటుగా ఉండేది. వయస్సు అయిపోయిన స్థితిలో కాళ్ళు చేతులు పనిచేయని స్థితిలో యేసయ్యను గూర్చి ప్రకటించుటకు ఆమె తన శక్తి కొలది చేసి తన పరుగును విజయవంతంగా ముగించారు. 

 

పరిశుద్ధ గ్రంధంలో యేసుక్రీస్తు పాదాల పైన విలువగల అత్తరును పూసిన స్త్రీని చూసి ఈమె తన శక్తి కొలది చేసెను అని యేసుక్రీస్తు చెబుతున్నారు. ఈమె తన యొద్ద ఉన్న దానిని యేసయ్యకు ఇచ్చింది. యేసుక్రీస్తు నాపైన చూపిన ప్రేమకు బదులుగా నేను ఏమియు ఇవ్వలేను కాని నేను దేవుని పైన ఉంచిన ప్రేమను బయలు పరుచు విధముగా నేను ఈ పనిని చేస్తాను అని అనుకోని ఇలా చేసి ఉంటుంది. మరియు ఆమె ఆటంకములను ఎదుర్కొని క్రియలను జరిగించింది. ఈమె చేసిన పనిని చూసిన చుట్టూ వున్న వారు పొగడలేదు బదులుగా లోటులను వెతికి సనుగుకున్నారు. తమ ఆలోచనలను తెలియజేస్తున్నారు. కాని వాటన్నింటినీ పట్టించుకోకుండా ఆమె తన శక్తి కొలది చేయుటను మనం చూస్తున్నాం. అవకాశమును ఉపయోగించు కొన్నది. ఈమె అత్తరును పోసి ముందుగా నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను అని యేసుక్రీస్తు ఆమెను పొగిడారు. యేసుని కలుసుకొనుటకు ఇంకొక అవకాశం దొరుకుతుంది అప్పుడు అత్తరును పోయావచ్చు అని అనుకొనలేదు. నన్ను మరియు నేను చేసిన ఈ పనిని ఆయన అంగీకరిస్తారా అని ఆలోచించను లేదు. ఆమె దొరికిన అవకాశమును ఉపయోగించుకొనెను. తన శక్తి కొలది చేసెను అనే పొగడ్తను పొందుకుంది. ఈమె చేసినది సర్వ లోకమంతట ప్రశంసించ బడును అని యేసుక్రీస్తు చెప్పారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీరు ఈ నూతన సంవత్సరం లోనికి అడుగుపెట్టి వున్నారు అంటే దేవుడు మీ పైన ఉంచిన కృపే. మీరు కూడా మీ శక్తి కొలది చేస్తారు అనే ఆశతో ఈ నూతన సంవత్సరమును దేవుడు ఇచ్చారు. యేసయ్య కొరకు మీ చేతనైనంత మట్టుకు చేయుటకు ముందుకు రండి. ప్రభువు ఇంకా ఆయనను ఎరుగని అనేక కోట్లా కొలది ప్రజల కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నారు. వారు ప్రభువును ఎరుగులాగున మరియు ఆయన కన్నీటిని తుడుచులాగున మీరు మీ శక్తి కొలది చేసినప్పుడు ప్రజలు యేసుని కనుగొంటారు. ఆమెన్.

- శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఈ నూతన సంవత్సరంలో పరిచర్యలో దేవుని హస్తం తోడై యుండి నడిపించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş