Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Saturday, 31-Dec-2022

దిన ధ్యానము(Telugu) 31.12.2022 (Christmas Special)

 

అంశం:- చివరిగా.

 

 

"మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి" - 2 కోరింథీయులకు 13:5

 

సంవత్సరం చివరి రోజునకు వచ్చిన మనం మన జీవితంలో కొంచం వెనుదిరిగి చూసినట్లైతే మనం ఆశించే అనేక కార్యాలను ప్రతి రోజు చేస్తుంటాం. కాని దేవుడు ఆశించే వాటిని ఎప్పుడు చేశాం అని ఆలోచిస్తే అది ప్రశ్నర్ధకమే. మనకు మనమే ప్రశ్నించు కోవాల్సిన ప్రశ్నలను చూద్దాం. 

 

1. చివరిగా నేను ఎవరి రక్షణ కొరకు ఏడ్చాను.

2. చివరిసారి ఎప్పుడు నేను దేవున్ని సంతోష పరిచాను. 

3. చివరిగా నేను ఎప్పుడు ఆకలి గోనిన వారికి ఆహారం ఇచ్చాను. 

4. చివరిగా నేను ఎవరికి సువార్త ప్రకటించాను. 

5. దేశం కొరకు నేను ఎప్పుడు చివరిగా ప్రార్ధించాను.

6. చివరిసారి నేను ఎప్పుడు ఒక రోగిని దర్శించాను.

7. చివరిగా నేను ఎప్పుడు దేవుని ప్రసన్నతను పొందుకున్నాను.

8. చివరిసారిగా నేను ఎప్పుడు సువార్త పత్రికలను ఇచ్చాను.

9. చివరి సారిగా నేను ఎప్పుడు నా సంఘం కొరకు కన్నీటి ప్రార్థన చేసాను.

10. చివరి సారిగా నేను ఎప్పుడు నా తప్పును గ్రహించి నా పొరుగువానికి క్షమాపణ అడిగాను. 

11. క్రీస్తు నిమిత్తము నేను చివరిసారిగా ఎప్పుడు అవమానించబడ్డాను.

12. చివరి సారిగా నేను ఎప్పుడు దేవుని చిత్తమును జరిగించాను. 

13. నా శత్రువుల కొరకు నేను చివరిసారిగా నేను ఎప్పుడు ప్రార్ధించాను. 

14. చివరిగా నేను ఎప్పుడు నా మరణము తరువాత చెప్పబడే సాక్ష్యం కొరకు ఆలోచించాను.

15. చివరిగా నేను చేసిన తీర్మాణము నెరవేర్చానా.

 

పైన చెప్పబడిన ప్రశ్నలకు మనకు మనమే అడిగి మన మనసాక్షి ప్రకారం నిజముగా సమాధానం చెప్పినట్లయితే అనేక ప్రశ్నలకు మనం ఆలోచించి సమాధానం చెప్పలేని పరిస్థితి. కారణం ఏమిటి అంటే ఈ పనులు చేసి చాలా నెలలు మాత్రమే కాదు సంవత్సరాలు కూడ అయి ఉండవచ్చు. సాధారణమైన ఈ పనులు కూడా క్రైస్తవుల మైన మన జీవితంలో లేవు అని గ్రహించినట్లయితే ఈనాడే వీటిని చెయ్యాలి అని తీర్మానించు కుందాం. దేవుడు తన కృపను అనుగ్రహించును గాక! ఆమెన్.

- బ్రదర్. కె. డేవిడ్ గణేషన్ గారు.

 

ప్రార్థన అంశం:-

రాబోయే నూతన సంవత్సరం ఆశీర్వాదకరముగా ఉండు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet