Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Friday, 30-Dec-2022

దిన ధ్యానము(Telugu) 30.12.2022 (Christmas Special)

 

అంశం:- కృతజ్ఞతతో.

 

"నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము" - కీర్తనలు 103:1

 

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గల ఒక ప్రముఖ పత్రికలో గొప్పగా రచించే ఉపాధ్యాయుడు యోనాతాన్. అతను ఒకసారి తన పాఠకుల కోసం ఆనందంలో పెట్టుబడి పెట్టడానికి 9 చిట్కాలు అనే వ్యాసం రాసాడు. అందులో ఒకటి పొందుకున్న మేలులను లెక్కించు చూడు అనేది. ఇది జాన్ సన్ పాత్మన్ రాసిన లెక్కించి చూడు నీవు పొందుకున్న ఆశీర్వదాలు అనే క్రైస్తవ గీతం ఆధారంగా రూపొందించ బడింది. సంతోష కరమైన ఒక నూతన సంవత్సరం కొరకు వేచి యున్న మనకు కూడా ఈ అంశం చాలా అవసరం. కృతజ్ఞతతో కూడిన హృదయం మనకు ఉన్నట్లు అయితే సంతోషంగా జీవించగలం. దేవుని యొద్దనుండి మనం పొందుకున్న మేలులు మనం లెక్కించి చూసినప్పుడు అవి మనలను ఆశ్చర్య పరచి మన అలసటను తొలగించును కదా! కాబట్టి ఈ సంవత్సరం చివరి రోజులను దేవునికి కృతజ్ఞతలు తెలుపడం కొరకు కేటాయిద్దాం. మన హృదయాన్ని కృతజ్ఞతతో నిండి ఉండనిద్దాం. సాధారణ గొర్రెల కాపరి వలె ఉన్న దావీదును దేవుడు ఏర్పరుచుకొని ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించి హెచ్చించారు. దావీదు హృదయం ఎల్లప్పుడూ దేవుని ముందు కృతజ్ఞతను కలిగి ఉండేది. ఈ సంగతిని గూర్చి దావీదు రాజు ఈవిధంగా చెబుతున్నాడు. నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏపాటిది? అని స్తుతిస్తూ పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. మరియు దావీదు తాను వ్రాసిన కీర్తనలో అనేక సార్లు తన సమస్య గురించి విలపించి నప్పటికి ఆ కీర్తనను ముగించినప్పుడు దేవున్ని స్తుతిస్తూ ముగించడం మనం చూస్తున్నాం. మనము కూడా ఈ సంవత్సరంలో అనేక సమస్యలను, శ్రమలను దాటి వచ్చి ఉండవచ్చు. కాని వాటి మధ్యలో దేవుడు మనకు ఇచ్చిన సమాధానమును, సంతోషమును లెక్కించి కృతజ్ఞతా పూర్వకముగా ఈ సంవత్సరమును ముగిద్దాం.

 

 క్రీస్తులో ప్రియమైన వారలారా! మన దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు మనలో అనేక కార్యాలు ఉన్నాయి కదా! పాపపు బానిసత్వం నుండి మనలను విడిపించి నందుకు మన కన్నులను కన్నీటి నుండి మన కాళ్ళను తడబాటు నుండి మన ఆత్మను మరణం నుండి తప్పించి నందుకు, మరియు ఎన్నో ఆపదల నుండి మనలను విడిపించి నందుకు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు తెలుపుదాం. మరియు ఈ సంవత్సరంలో ఎన్నో అసౌకర్యాలు ఉన్నప్పటికీ ఆయనే మన ఆత్మకు శాశ్వతమైన వెలుగుగా ఉండి ప్రశాంతంగా జీవించే హృదయం ఇచ్చారు కదా! అందుకొరకు ఆయనను స్తుతిద్దాం. ఇదే విధంగా ఇంకా ఎన్నో మేలులు ఉన్నాయి. అవును చెప్ప శక్యం కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఆమెన్.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఈ సంవత్సరం అంతా మనలను నడిపించే దేవున్ని మనసారా స్తుతిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al