Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Thursday, 29-Dec-2022

దిన ధ్యానము(Telugu) 29.12.2022 (Christmas Special)

 

అంశం:- ప్రోత్సహిద్దాం.

 

"ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెనుగాని" - మత్తయి 14:29

 

మూడవ సంవత్సరం బీ.ఎస్.సి చదువుతున్న కుమార్ మంచి ఫుట్ బాల్ ప్లేయర్. పాఠశాలలో చదువుతున్నప్పుడే అనేక సార్లు జిల్లా స్థాయిలో ఛాంపియన్ షిప్ ను సంపాదించాడు. ఒక రోజు హఠాత్తుగా కుమార్ చాలా అలసటతో, బాధతో ఉండుటను చూసిన తన స్నేహితుడైన రాజు తన దగ్గరకు వెళ్ళి మాట్లాడాడు. అప్పుడు తనకు క్రీడలపైన ఉన్న మక్కువను తన తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో గత మూడు సంవత్సరాలుగా కళాశాలలో జరిగిన పోటీల్లో పాల్గొన లేదు అని కుమార్ చెప్తూ బాధపడ్డాడు. క్రీడల్లో మాత్రమే కాదు చదువులో కూడా మంచి మార్కులు తెచ్చు కొనేవాడు. కాని కళాశాలలో తన ప్రతిభను బయటకు తీసుకొని రాలేక చదువులో అపజయాన్ని పొందాడు. అప్పుడు తన స్నేహితుడైన రాజు నీకు క్రీడలో ప్రతిభను ఇచ్చిన యేసయ్య చదువులో విజయాన్ని ఇవ్వగలరు. ఇతరులు మాట్లాడే మాటలు విడిచిపెట్టి మొదట యేసయ్య సహాయం చెయ్యగలరు అని నమ్ము. నీ జీవితంలో యేసయ్య కొరకు సమయాన్ని కేటాయించు అని విశ్వాస సహితమైన మాటలు మాట్లాడి ప్రోత్సహించాడు. ఆ రోజు నుండి కుమార్ యేసయ్య తో మాట్లాడడం, పరిశుద్ధ గ్రంథమును మరియు దేవునికి సమయం ఇవ్వడం మొదలు పెట్టాడు. చదువులో విజయం సాధించడం చూసిన తల్లిదండ్రులు అతనిని రాష్ట్ర స్థాయిలో ఫుట్ బాల్ ఆడుటకు అనుమతించారు. ఆ పోటీలో గెలిచిన కుమార్ సాధకుడు గా మారాడు. యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుటను చూసిన పేతురు నేను వస్తాను అని అడిగిన వెంటనే యేసుక్రీస్తు రమ్మని చెప్పి ప్రోత్సహించారు. ఒక వేళ యేసుక్రీస్తు పేతురుతో నీవు నడువలేవు అని చెప్పి ఉంటే పేతురు నడవగలిగే వాడు కాదు. బదులుగా యేసుక్రీస్తు యొక్క విశ్వాస సహితమైన మాటల ద్వారా పేతురు సముద్రం. మీద నడవగలిగాడు. మన చుట్టూ వున్న అనేకులు ఏదో ఒక పరిస్థితి కారణంగా తమ ప్రతిబలను పాతిపెట్టేస్తుంటారు. మనము కూడా వారి వలె నిరుత్సాహ పడకుండ రాజు వలె విశ్వాస సహితమైన మాటలు మాట్లాడి ప్రోత్సహిస్తే కుమార్ వంటి అనేకులు ముందుకు సాగడం మొదలు పెడతారు. యేసుక్రీస్తు కూడా మన ముందు ఒక ఉదాహరణగా శిష్యులు అవిశ్వాసులుగా ఉన్నప్పటికీ విశ్వాస సహితమైన మాటలు మాత్రమే మాట్లాడారు. అందువలన దేశాన్ని కదిలించే శిష్యులు లేచారు. మనము కూడా మనతో ఉన్న వారిని ప్రోత్సహించి దేశాన్ని కదిలించే వారి వలె అభివృద్ధి చేద్దాం.

- డాక్టర్. విశాలీ గారు.

 

ప్రార్థన అంశం:-

రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al