Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Wednesday, 28-Dec-2022

దిన ధ్యానము(Telugu) 28.12.2022 (Christmas Special)

 

అంశం:- దేనిని ఏర్పరుచుకోవాలి.

 

"రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును" - మత్తయి 6:34

 

ఒక రాజు తాను మరణించిన తరువాత తనను సమాధి చేసే స్థలం కూడా గొప్పగా ఉండాలి అని కోరుకున్నాడు. దాని కొరకు గొప్ప శిల్పిల ద్వారా గొప్ప శిల్పాలతో ఒక సమాధిని సిద్ధపరిచాడు. ఆ సమాధి యొక్క అందమును, గొప్పతనమును చూసి చాలా పొంగిపోయాడు. రెండు వారాలు గడిచాయి. ఇప్పుడు సమాధిని చూసినప్పుడల్లా తాను ఒక రోజు మరణించి ఈ స్థలంలో పూడ్చి వేయబడతాను అనే ఆలోచన కలిగింది. ఎల్లప్పుడూ మరణం గురించి ఆలోచిస్తూ నిద్రను కోల్పోయాడు. ఈ సంగతిని ఎరిగిన మంత్రి రాజా రేపటి దినమున ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఆందోళన చెందుట కంటే ప్రతి రోజు మనం జీవిస్తున్న జీవితాన్ని ఆస్వాదించడమే తెలివైన పని. ఏదో ఒక రోజు మీరు సమాధి చేయబడుటను గుర్తు చేసుకొంటూ ఈరోజు అనుభవించాల్సిన సంతోషమును పాతిపెట్టేశారు అని అన్నాడు. 

 

మనలో అనేకులు రేపటిని గూర్చి చింతించి ఈరోజు సంతోషంగా జీవించుట మరచిపోతున్నాం. మనుష్యుల మైన మనము ఎటువంటి స్వభావంతో జీవిస్తున్నామో అనే విషయాన్ని ఎరిగి యున్న మన ప్రభువైన యేసుక్రీస్తు తన కొండమీద ప్రసంగంలో రేపటిని గూర్చి చింతించకుడి అని మత్తయి సువార్తలో 10 వచనాల్లో చెబుతున్నారు. దీనిని ఎన్నో సార్లు మనం చదివియున్నాం. మనలో చాలా మంది కంఠత చేసి కూడా చెప్పగలం కాని ఎప్పుడో ఏదో ఒక దాని కొరకు చింతిస్తూ ఉంటాం. చింతించుట అనేది మన సాధారణ స్వభావం అయిపోయింది. 

 

ఇంకా నేను సొంత ఇల్లు కట్టలేదు అని చింతించి అద్దె ఇంట్లో జీవిస్తూ రోజువారీ సంతోషాలను అనుభవించడం లేదు. ఇంకా మూడేండ్లలో నా కుమార్తెకు వివాహం చెయ్యాలి అని ఆలోచిస్తూ చింతించి కుమార్తె తనతో ఉన్న అన్ని దినాలు తనతో కలిసి సంతోషంగా ఉండాల్సిన సంతోషాన్ని కోల్పోతున్నాం. చింతించుట వలన దేనిని పెంచలేము, తగ్గించలేము అనే విషయాన్ని మనకు బాగా తెలుసు. అలాంటప్పుడు ఈ అనవసరమైన ఆలోచన ఎందుకు?

 

ప్రియమైన వారలారా! కాకి, పిచ్చుకలకు కూడా ఆహారం అందిస్తున్న దేవుడు ఆయన దృష్టిలో ప్రత్యేకించ బడిన మిమ్మును పోషించ కుండా ఉంటారా? ఉండరు కదా! కాబట్టి రాబోయే సంవత్సరం గూర్చిన విషయాలను, భారలను దేవుని పైన మోపి ఈరోజు దేవుడు మనం అనుభవించుటకు మనకు ఇచ్చిన వాటితో సంతోషంగా ఉందాం. హల్లేలూయా!

- శ్రీమతి. గ్రేస్ జీవ మణి గారు.

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్లో నివాసం ఉండి సేవ శిక్షణను పొందుకొంటున్న ఉత్తర రాష్ట్ర శిక్షణ సేవకుల కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet