By Village Missionary Movement
Tuesday, 27-Dec-2022దిన ధ్యానము(Telugu) 27.12.2022 (Christmas Special)
అంశం:- అద్బుతములలో గొప్ప అద్బుతం.
"నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను" - కీర్తనలు 139:14
దేవుడు తన స్వరూపమందు మనుష్యుని సృజించి తన జీవ వాయువును ఊది ఆశ్చర్యకరముగా సృష్టించారు. మన శరీరానుసారముగా ఆయన సృష్టిని చూస్తే చాలా ఆశ్చర్యపోతాము. మన శరీరంలో 37.2 ట్రిలియన్ల కణాలు ఉన్నాయి. వాటిలో 200 రకాలు కలవు. మన మెదడులో 100 మిలియన్ల న్యూరాన్లు ఉన్నాయి. మనకు ప్రతి రోజు 50000 లకు పైగా ఆలోచనలు వస్తాయి. మన మెదడు ఒక క్వార్డిలియన్ సమాచారాన్ని నిర్వహించ గలదు. మన శరీరంలో 60 మిలియన్ల ఇంద్రియ గ్రహకాలు ఉన్నాయి. మన కన్నులు 10 మిలియన్ల విభిన్న రంగులను చూడగలవు. మనం 50 వేల రకాల వాసనలను చూడగలము. మనం రోజు 23,040 సార్లు శ్వాస తీసుకొంటాం. మన గుండె 1,15,200 సార్లు కొట్టుకొంటుంది. మన గుండె శరీరం నుండి వేరు చేయబడిన అందులోని విద్యుత్ ప్రేరణ వలన కొద్దీ సేపు కొట్టుకొంటునే ఉంటుంది. పిల్లల శరీరంలో 300 ఎముకలు, మరియు పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి. 13 నానో మీటర్ల చిన్న వస్తువులను పసిగట్ట గలం.
ఇలా దేవుడు సృష్టించిన మనుష్యుని శరీరంలో భాగాలను పరిగణలోకి తీసుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన సంకల్పం లేకుండా మన తల వెంట్రుకలు కూడా రాలవు. ఎంతటి గొప్ప ప్రేమ నేను నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను అని సెలవిచ్చిన వాడు మరణపు చీకటి కలిగిన స్థితిలోను, కన్నీటి లోయలలోను ఆశీర్వాద కరముగ తోడు ఉండి నడిపిస్తున్నాడు.
ఈ సంవత్సరాన్ని మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే మన యొక్క ప్రతి కదలికలో ఆయన మనతో ఉన్నాడు అని మనం గ్రహించ గలమా? లేదా చిన్న చిన్న సమస్యలకు కూడా నాకే ఎందుకు ఈ పరిస్థితి, నేను మాత్రమే ఎందుకు ఇలా ఉన్నాను అని విలపిస్తున్నారా? కొంచం ఆలోచించి చూడండి. మన శరీర భాగాలు అన్నీ సక్రమముగా పనిచేస్తే మనం కోటీశ్వరులమే. అవును లక్షల కొలది డబ్బులు మనం డాక్టర్లకు ఇవ్వ వలసిన అవసరం లేదు. మనలను దేవుడు ఆయన స్వరూపంలో సృజించడం మాత్రమే కాదు మన శరీరంలో ఇన్ని అద్బుతములను మనం తలుచుకొంటే మనం ఆయనను స్తుతించ కుండా ఉండలేము. ఇంతటి అద్బుతములతో నిండి ఉన్న మన శరీరం, మన జీవితం దేవునిచే మనకు ఇవ్వబడిన బహుమతి అని మనం గ్రహించాలి. వ్యాధులు, సమస్యలు పోరాటాలు వచ్చిన ఈ క్షణం వరకు మనలను సజీవంగా ఉంచారు కదా! వీటన్నింటి గురించి జ్ఞాపకం చేసుకొని మీ హృదయాలను కృతజ్ఞతతో నిండనివ్వండి. రాబోయే నూతన సంవత్సరాన్ని కృతజ్ఞత పూర్వకంగా ఆహ్వానిద్దాం. హల్లేలూయా!
- శ్రీమతి.అన్బు జ్యోతి స్టాలిన్ గారు.
ప్రార్థన అంశం:-
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గడ్ అనే రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచర్యల కొరకు ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250