Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Monday, 26-Dec-2022

దిన ధ్యానము(Telugu) 26.12.2022 (Christmas Special)

 

అంశం:- యోబు.

 

" మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు" - యాకోబు 5:11

 

యోబు 1: 1

 యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని దేవునిచే పొగడబడిన ఒకే ఒక దైవ వ్యక్తి యోబు. ఇతను పరిశుద్ధమైన జీవితం జీవించి నీతిమంతునిగా ఉన్నాడు. నీతిమంతుడు అంటే దేవుని ఎదుట చక్కగా జీవించిన వాడే కదా! తన కుటుంబీకుల యొద్ద చిన్న చిన్న తప్పులు కనిపించిన వెంటనే వారి కొరకు దేవుని ఎదుట దహనబలి అర్పించేవాడు. దేవున్ని ఆరాధించుటలో, పాప క్షమాపణ పొందుకొనుటలో నిజాయితీ గల వాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి మరియు అపవాదికి మధ్య సంభాషణ దాని వలన ఏర్పడిన పరిణామాల మధ్య తాను ఉండుట యోబు గ్రహించలేదు. ఒక్క రోజులొనే తన పదిమంది పిల్లలను, విస్తారమైన ఆస్తిని కోల్పోయినప్పటికి దేవున్ని కోల్పోలేదు. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టు చున్నాను అని చెబుతున్నాడు. తన కొరకు ఏర్పడిన బాధలను ఓర్పుతో, సహనంతో భరించాడు. ఏన్ని కష్టాలు వచ్చిన తనను ప్రేమించే నీతిమంతులు కలరు అనే నిజాన్ని రుజువు చెయ్యడానికి దేవుడు యోబును ఏర్పరుచుకున్నారు. 

 

భార్య యొక్క ఎగతాళి మాటలు, స్నేహితుల యొక్క నెరపు సాక్ష్యాలు సహించి ఏం జరిగినా దేవున్ని వెంబడిస్తాను అని నమ్మకంగా నిలబడ్డాడు. ఆ స్నేహితుల కొరకు ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకున్నారు. అనేక వేల సంవత్సరాలకు ముందే దేవుని రాకడ మరియు పునర్ జీవనం కొరకు స్పష్టత పొందుకొన్నాడు. చివరిగా అపవాది ఆలోచనలను త్రోసివేశాడు. ఆపవాది ఓడిపోయాడు.

 

ప్రియమైన వారలారా! మన జీవితంలో కష్టాల మార్గం ద్వారా దేవుడు అనేక పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు అనే విషయం నిజమే. కాని పాఠాలను నేర్చుకోవడానికి మాత్రమే కష్టాలను అనుమతిస్తున్నారు అని చెప్పలేము. ఈ విషయాన్ని యోబు జీవితం ద్వారా మనం తెలుసుకొంటున్నాం. కాబట్టి మన వ్యాధి, బాధ, నష్టం, అనే వాటి అన్నింటికి కారణం తెలుసుకొన కుండా ఓపికతో ఉందాం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఒక వేల ఇటువంటి పరిస్థితుల గుండా నడుస్తున్నప్పుడు మిమ్మును గూర్చి అవమాన కరముగా మాట్లాడిన బంధువులను స్నేహితులను క్షమించి సంతోష పడండి. మీరు కోల్పోయిన స్వస్థత, సంతోషం, సమాధానం వంటి మేలులను రాబోయే నూతన సంవత్సరంలో రెండంతలుగా ఇచ్చి మిమ్మును ఆశీర్వదిస్తారు. ఆమెన్

- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు.

 

ప్రార్థన అంశం:-

అర్థవంతమైన క్రిస్మస్ ను జరుపుకొనుటకు సహాయం చేసిన దేవున్ని స్తుతిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet