Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Friday, 23-Dec-2022

దిన ధ్యానము(Telugu) 24.12.2022 (Christmas Special)

 

అంశం:- దినత్వంలో అర్థవంతమైన క్రిస్మస్.

 

"ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది" - మత్తయి 5:3

 

నాగరికత తో నిండిన ఈ ప్రపంచంలో దీనత్వం అనే పదాన్ని మరచి పోయే అంతగా మనుష్యులు తమ మనస్సులో మరియు ఉపయోగించే వస్తువులలో మాత్రమేనా తాము మాట్లాడే మాటల్లో కూడా ఆడంబరా దాహమే ఉన్నది. క్రైస్తవులు దీనికి మినహాయింపు కాదు. పండుగ సమయాల్లో ఇది ఇంకా అధికంగా కనబడుతుంది. కాని మన యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జననం నుండి మరణం వరకు దీనత్వం కలిగి చూపించి మనకు మాదిరికరము చూపించి వెళ్లారు. 

 

భూమి ఆకాశం పట్టని దేవుడు తన కుమారుడు జన్మించడానికి ఉత్తమమైన లేదా ఉన్నతమైన నగరం ఎంచుకొనలేదు కాని సాధారణ గ్రామము అయిన బేత్లెహేము ను ఏర్పరచుకున్నారు. అందులో కూడా రాజభవనము కాదు పశువుల శాలను ఎంచుకున్నారు. ఆయనకు తల్లి కాబోతున్న కన్యక అయిన ఆ దేశపు రాణి లేదా యువరాణి లేక అందగత్తె అని పేరు పొందుకున్నది కాదు. ఆమె ఒక సాదారణ పేద కన్యక. రక్షకుడు పుట్టాడు అనే వార్తను దేవదూతలు ఆ దేశంలో గల ధనవంతులకు, రాజులకు చెప్పలేదు. బదులుగా సమాజంచే సంచార జాతులుగా పరిగణించ బడే గొర్రెల కాపరులకు తెలియజేసారు. ఆయన భూమి పైన పరిచర్య చేస్తున్న దినాల్లో తల వాల్చుకోనుటకైనను స్థలం లేదు. ఆయన మరణిచినప్పుడు ఆయనకు సొంత సమాధి లేదు. ఇందువలన ఆయన పేదవారికి మాత్రమే దేవుడు అని అర్థం ఆయన రాజులకు రాజు. ఈ భూమి మీద పైన ఉన్న ఐశ్వర్యం, బంగారం, వెండి, అధికారం రాజ్యాలు అనేవి సమస్తము ఆయన ద్వారానే కలిగాయి. ఇంతటి గొప్పవాడై యున్నప్పటికి ఆయనను వెంబడించే మనకు ఈ లోక జీవితం శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలియజేయుటకు మరణం వరకు దినత్వం కలిగి మనకు మాదిరిని చూపించి వెళ్ళారు. 

 

ప్రియమైన వారలారా! మన జీవితంలో డబ్బు, ధనం, ఐశ్వర్యం ఉండడం తప్పు అని బోధించడం లేదు కాని ఇవి మాత్రమే ముఖ్యం అని ఆలోచించే ఆలోచనను గద్దిస్తుంది. దీనత్వం అనేవి లోకంలో ఉన్నవి ప్రాముఖ్యం అనుకొనకుండా ఆశీర్వాదముల వైపు ప్రయాణం చెయ్యడం ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నట్లు అయితే వ్యర్థమైన ఆడంబరాలు మన జీవితంలో నుండి తొలగిపోతాయి. మనము కూడా ఈ పండుగ రోజుల్లో అనవసరమైన అడంబర క్రియలు ఖర్చులను నిషేధిద్దాం. దీనులు కూడా మనతో సులభంగా సంబంధం కలిగే విధముగా మన జీవితంలో దీనత్వం కలిగి జీవిద్దాం. ఆమెన్.

- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్.

 

ప్రార్థన అంశం:-

రేపటి దినమున జరగబోయే క్రిస్మస్ పండుగలో అనేకులు పాలుపొందు కొనులాగున మరియు వారి యొక్క పేర్లు జీవ గ్రంధంలో చోటు సంపాదించు కొనులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet