By Village Missionary Movement
Thursday, 22-Dec-2022దిన ధ్యానము(Telugu) 23.12.2022 (Christmas Special)
అంశం:- అర్థంలేని క్రిస్మస్.
"అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా" - నెహెమ్యా 5:9
ప్రియమైన వారలారా! అర్థవంతమైన క్రిస్మస్ అనే అంశం పైన ప్రతి రోజు మన మోక్ష ప్రయాణంలో ద్యానిస్తున్నాం. ఈరోజు అర్థం లేని క్రిస్మస్ అంటే ఏమిటి అని ఆలోచించి చూస్తే బాగుంటుంది.
1. పక్క ఇంటి నుండి నీరు లేదా చెత్త మన పెరడులోనికి వచ్చినప్పుడు లేదా వారి వాహనములను ఇంటి ముందు నిలబెట్టినప్పుడు మనం చిరాకు లేదా కోప పడతాం. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో పగతో ఉన్నప్పుడు క్రిస్మస్ రోజు మాత్రమే మన ఇంటి ముందు వేలాడదీసే స్టార్ క్రీస్తుకు మహిమకరముగా ఉంటుందా లేదా ఇతరులకు సంతోషాన్ని ఇస్తుందా?
2. మనం ఉద్యోగాలు చేసే స్థలాల్లో సంవత్సరం అంతా ముఖమును ముడుచుకొని క్రైస్తవులు కాని వ్యక్తుల విషయంలో మాటి మాటికి కోపపడి క్రిస్మస్ రోజుల్లో చిరునవ్వుతో కూడిన ముఖముతో కేకు ఇచ్చినప్పుడు అది నిజమైన హ్యాపీ క్రిస్మస్ అవుతుందా?
3. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగం చేసే క్రైస్తవులు తమ పనిలో లంచం తీసుకోవడం సత్యాన్ని వక్రీకరిచడం వంటి పనులలో పాలుపంచుకొని క్రిస్మస్ రోజుల్లో వెనకబడిన ఉద్యోగస్తులకు దుస్తులు,.కేకులు ఇచ్చినప్పుడు అది మహిమకరముగా అవుతుందా? లేదా క్రీస్తుకు అవమాన కరముగా ఉంటుందా?
4. కళాశాలలో చదువుతున్నప్పుడు క్రైస్తవ పిల్లలే ఉండి కూడా ఇతరుల వలె పొరుగువారిని ఎగతాళి చెయ్యడం అశుద్ధమైన మాటలు మాట్లాడి సంతోషించడం తప్పుడి వెబ్సైట్ పంచుకోవడం. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని చెప్పి మనస్సుకు నచ్చిన విధముగా వ్యర్థముగా తిరగడం ఇలా ఉండి క్రిస్మస్ రోజున మాత్రం నిజాయితీ గల క్రైస్తవుల వలె శుభాకాంక్షలు పంచుకొన్నప్పుడు మీ స్నేహితుల ముందు యేసుక్రీస్తు మహిమ పరచబడతారా?
ప్రియమైన వారలారా! పైన చెప్పబడిన ప్రతి సూచనలో అర్థం లేని క్రిస్మస్ ను చూస్తున్నాం. అవును మనం నిజాయితీ గల క్రైస్తవునిగా ఉన్నప్పుడే అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకోన గలం. లేకుంటే మన క్రిస్మస్ పండుగలో అడంబరం, ఆర్భాటం ఉంటాయి కాని అర్థం ఉండదు. క్రిస్మస్ రోజున మాత్రమే కాదు ప్రతి రోజు క్రీస్తును ప్రతిబింబించే క్రైస్తవునిగా జీవిస్తే మనం ఇచ్చే బహుమతులు, శుభాకాంక్షలు అర్థవంతముగా ఉంటాయి. అది మనకు మాత్రమే కాదు మన చుట్టూ వున్న వారికి కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆమెన్.
- బ్రదర్. కె. బెంజమిన్ గారు.
ప్రార్థన అంశం:-
గెత్సేమనే క్యాంపస్ చుట్టూ వున్న గ్రామాల్లో గల ప్రజలను పిలిచి క్రీస్తు జన్మదినమును ప్రకటించాలి అని తీసుకొంటున్న ప్రయత్నాలలో దేవుని హస్తం తోడై యుండి అవసరతలు సంధింప బడులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250