Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Wednesday, 21-Dec-2022

దిన ధ్యానము(Telugu) 22.12.2022 (Christmas Special)

 

అంశం:- అన్యజనులు మధ్య అర్థవంతమైన క్రిస్మస్.

 

"మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" - మత్తయి 5:16

 

ఒక దేవుని సేవకుడు క్రిస్మస్ ను గూర్చి వ్రాసిన ఒక కథ చదివాను. ఒక ఆలయంలో గల బలి పీఠం యొద్ద మోకాళ్ళ ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తి ప్రార్థన విని ఒక దేవదూత అతని యొద్దకు వచ్చారంట. అతను ప్రభువా క్రిస్మస్ రోజున వంట చేయుటకు ఒక కోడి కావాలి. మా బొధకుని ఇంట్లో చాలా కోళ్లు ఉన్నాయి. రెండు అంగీల గలవాడు ఒక దానిని ఏమియు లేని వాడికి ఇయ్యవలెను అని బోధించే ఆయన నాకు ఒక కోడిని కూడా ఇవ్వరు. కాబట్టి వాళ్ళ ఇంట్లో నుండి ఒక కోడిని దొంగలిస్తాను అని ప్రార్ధించాడు అంట. ఆ ప్రార్ధనను విని ఆశ్చర్య పోయిన దేవదూత ఒక సమాధి యొద్ద ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను ఇంకొక వ్యక్తి దగ్గరకు వెల్లరంట. అతడు స్నేహితుడా గత సంవత్సరం క్రిస్మస్ రోజున మన ఇద్దరం కలిసి త్రాగుతూ సంతోషంగా క్రిస్మస్ జరుపుకున్నాము. కాని ఈ క్రిస్మస్ కు నువ్వు అందుకని ఈ మందు బాటిల్ నీకు ఇస్తున్నాను అని చెప్పి మందు బాటిల్ అక్కడ పెట్టి వెళ్లి పోయాడు అంట. మరల ఆశ్చర్య పోయిన దేవదూత విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తున్న ఒక ఇంటి లోపలకి వెళ్లి చూసినప్పుడు ఆశగా ఆ ఇంటి అలంకరణ చూస్తున్న పేద పిల్లలను కొట్టాడు అంట ఆ ఇంటి యజమానుడు. మనుష్యుల క్రిస్మస్ పండుగలను చూసిన దేవ దూత చాలా బాధతో తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు అంట. మత్తాయి సువార్త 5:13-16 వచనాల్లో మనుష్యులు తన సత్ క్రియలను చూసి దేవున్ని మహిమ పరచాలి అని వ్రాయబడి ఉన్నది. అన్య జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులు అని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవున్ని మహిమ పరుచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై యుండి 1 పేతురు 2:12 లో మనం చూస్తున్నాం. కాబట్టి పైన విన్న కధ ప్రకారంగా దేవుని నామం దూషింపబడు విధంగా క్రిస్మస్ ను జరుపుకొనకూడదు. చాలా మంది క్రైస్తవులు మద్యం సేవించి క్రిస్మస్ ను జరుపుకొంటున్నారు ఎంతటి బాధకరం. 

 

ప్రియమైన వారలారా! యేసయ్య ను ఎరుగని అన్యజనులకు ఆహారమును, దుస్తులను ఇచ్చి యేసయ్య ప్రేమను ప్రకటించండి. యేసయ్యను ఎరుగని మీ స్నేహితులను పిలిచి సువార్తను పంచుకొనండి. క్రిస్మస్ ను గూర్చిన పత్రికలను ఎవరెవరికి ఇవ్వాలో వారందరికీ ఇవ్వండి. దుఃఖం, వ్యాధి, ఒంటరి తనంలో బ్రతుకుతున్న లోకస్తుల యొద్దకు వెళ్ళి క్రిస్మస్ శుభ వార్తను తెలిపి నమ్మకం గల మాటలు మాట్లాడి వాళ్ళను ఉత్సాహ పరచండి. ఇంటి అలంకరణ దీపాలు ఇచ్చే వెలుగు కంటే మన సత్క్రియలు ఇచ్చే వెలుగు మనుష్యుల ముందు ప్రకాశింప నిద్దాం. దేవుని నామం మహిమ పరచబడుతుంది. పరలోకం సంతోషిస్తుంది. హల్లేలూయా!

- శ్రీమతి. గీతా రిచర్డ్ గారు.

 

ప్రార్థన అంశం:-

యవ్వనస్తుల కొరకు ముద్రించబడుతున్న పత్రికల ద్వారా అనేక మంది యవ్వనులు తాకబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al