Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Wednesday, 21-Dec-2022

దిన ధ్యానము(Telugu) 21.12.2022 (Christmas Special)

 

అంశం :-ఇతరల కార్యములు చూచుటలో అర్థవంతమైన క్రిస్మస్ 

 

"మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను" - పిలిపి 2:4

 

ఒక పేద స్త్రీ ధనవంతుని ఇంట్లో పనిచేస్తూ వచ్చింది ఆమె కుమారునికి క్రిస్మస్ కానుకగా ఒక అందమైన డ్రెస్ మరియు కొంచెం డబ్బులను ఇచ్చారు ఆ ఇంటిగల యజమానుడు సంతోషంగా తన ఇంటికి వెళ్తున్న ఆ స్త్రీ దారిలో తన కుమారుని వయస్సు కలిగిన ఒక బాలుడు మంచి దుస్తులు లేక పేదరికంతో బాధపడుతూ ఉండటం చూసింది ఆమె హృదయంలో చాలా బాధ కలిగింది. తన కుమారుని కొరకు ఇచ్చిన దుస్తులను ఈ చిన్న బాలునికి ఇచ్చేసింది తర్వాత వెళ్తూ ఉండగా దారిలో తన కుమారుని కొరకు డ్రెస్ ని కొనాలని అనుకుంది తన యజమానుడు ఇచ్చిన డబ్బులు చేతిలో ఉన్నాయి తన యజమానుడు ఇచ్చినటువంటి డ్రెస్ ని కొనాలని దుకాణదారులు చేతిలో ఆ డబ్బులను పెట్టి మిగతా డబ్బులు వచ్చే నెలలో ఎలాగైనా చెళ్ళించేస్తాను అని చెప్పింది ఆ దుకాన దారుడు నిన్ను ఎలా నమ్మాలి నీలాఎంతో మంది చెప్పి వెళ్లిపోయారు అని గ్రుడ్డి గా మాట్లాడాడు ఇదిఅంతటిని గమనించిన వేరొక చిన్న బాలుడు వాళ్ళ అమ్మతో అమ్మ నా కొరకు కొన్న డ్రెస్ ను ఈ ఆంటీకి ఇచ్చేద్దామా సండే క్లాసులో కూడా మన యొద్ద ఉన్నవి ఇతరులకు ఇవ్వడమే క్రిస్మస్ అని చెప్పారు అని అన్నాడు అమ్మ తనను చిరునవ్వుతో చూసిఆ డ్రస్ ఉన్న సంచిని ఆ స్త్రీ కి ఇచ్చేశారు తెరచి చూస్తే అది చాల ఖరీదైన డ్రస్ ఆ స్త్రీ సంతోసముగా దేవునికి కతజ్ఞతలు తెలిపింది అవును పేద బాలునికి సహాయము చేసిన ఆ పేద తల్లిని మరియు ఆచిన్న బాలుని చూసి పరలోకము సంతోషించిఉంటుంది కదా

 

లుకా 1:39-56 వచనాలలో గర్భవతి అయిన మరియా వయస్సు మించిన వృద్ధాప్యంలో గర్భవతి యైన ఎలిజ బెతుని చూడటానికి వెళ్లి వందనం చేసి మూడు నెలలు అక్కడ నివాసము ఉండుటను మనము చదువుతున్నాం వృద్ధురాలైన ఎలీస బెతుకు ఇది ఒక వరముల ఉండి ఉంటుంది ఆలోచించి చూడండి మరియా గర్భధారణ సమయంలో కూడా కొన్ని అసౌకర్యాలను కలిగి ఉండవచ్చు ఒకవేళ వైద్యుని వద్దకు వెళితే ఆ మొదట మూడు నెలలు చాలా ప్రాముఖ్యమైనయి ఎలాంటి బరువైన పనులు చేయకూడదు వాంతి తల తిరగడం మరియు వికారం వంటివి కచ్చితంగా ఉంటాయి అయినా ఏదో ఒకటి తింటూ ఉండాలి పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పి ఉంటారు ఒకవేళ మరియ తన సొంత కార్యాలును మాత్రమే చూసుకుని ఉంటే ఎలీషా వెతుకు వందనములు చేసి తిరిగి వచ్చేయవలసింది మూడు నెలలు ఆమెతో కూడా ఉండి ఆమెకు సహాయం చేసి ఉండాల్సింది కాదు

 

అవును ప్రియమైన వారలారా క్రీస్తు ఒక్కరి లాగా జన్మిస్తే మనం వెళ్లి అనేకులకు ఆశీర్వాదకరముగా మారతాం మన సొంత కార్యములను గురించి ఆలోచిస్తూ ఉండకుండా ఇతరుల కార్యములను గూర్చి కూడా ఆలోచిద్దాం మనకు కష్టాలు ఉండవచ్చు కానీ మన కంటే కష్టపడేవారు అనేకులు కలరు ఈ క్రిస్మస్ రోజులో వారిని వెతుక్కుంటూ వెళదాం మన శ్రమ సహాయం మరియు వస్తువుల ద్వారా వారికి సహాయ పడదాం ఈ క్రిస్మస్ ఒక అర్థవంతమైన క్రిస్మస్ గా ఉండనిద్దాం ఆమెన్

- మిస్సెస్ ఉమా విలియమ్స్ 

 

ప్రార్ధన అంశం:

సేవకుల కొరకు ప్రచురించబడు పత్రికల ద్వారా సేవకులు నూతన బలమును పొందు కొని క్రమముగా దేవుని సేవలో పరిగెత్తు లాగున ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet