Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Monday, 19-Dec-2022

దిన ధ్యానము(Telugu) 20.12.2022 (Christmas Special)

 

అంశం:- మరచి పోవుటలో అర్థవంతమైన క్రిస్మస్.

 

"దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక" – 2 కోరింథీయులకు 5:19

 

రష్యాలో కమ్యూనిస్టులు క్రైస్తవులను హింసిస్తున్న సమయంలో హారేడిన్ అనే మహిళ కూడా జైలులో బందింపబడి చాలా అధికంగా హింసింప బడింది. చాలా సంవత్సరాల తరువాత విడుదల పొందుకొని క్రీస్తును బోధిస్తూ వచ్చింది. ఇలా ఒకరోజు ఒక హాల్లో ప్రసంగిస్తున్నప్పుడు ముందు వరుసలో కూర్చున్న ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తే ఆమెను జైల్లో బంధించి హీంసించి తన సొంత సహోదరుడ్ని చంపిన చెరసాల అధికారి. ఆ రోజు కూటమి ముగిసిన తరువాత అందరూ కరచాలనం చేసి నప్పుడు ఆ వ్యక్తి కూడా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుటకు తన చెయ్యిని చాపాడు. అతనికి ఆమె ఎవరో తెలియనప్పటికి ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయింది. బాధ తన గొంతు వరకు నిండిపోయింది. యేసయ్య నీ ప్రేమ గల ఆత్మను నా హృదయంలో కురిపించుము అని ప్రార్దించి చిరునవ్వుతో తన చెయ్యిని చాపి కరచాలనం చేసింది. 

 

పరిశుద్ధ గ్రంధంలో తన సహోదరులు చేసిన ద్రోహమును మనసారా క్షమించిన మరిచిపోయిన యోసేపును గూర్చి చదువుతున్నాం. దేవుడు తనకు ఇచ్చిన మొదటి కుమారుడికి దేవుడు నా సమస్త బాధను మరచిపోవును అని చెప్పి మనష్షే అని పేరు పెట్టాడు. అవును క్షమించి మరచి పోయినప్పుడు మాత్రమే నిజమైన సంతోషం, ఆశీర్వాదం కలుగుతాయి. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో తండ్రిని విడిచి దూరంగా వెళ్లిపోయిన చిన్న కుమారుడ్ని మరల తన తండ్రి అంగీకరించుటను మనం చూస్తున్నాం. తన కుమారుడి యొక్క కఠినమైన మాటలు, అవిధేయత అన్నింటిని మరచి మరలా ప్రేమించాడు తండ్రి.

 

ప్రియమైన దేవుని పిల్లలారా ఈ క్రిస్మస్ దినాల్లో మన పరమతండ్రి మనస్సు మనలో ఉన్నదా? మన జీవితంలో జరిగిన కార్యాలు మనలను గాయపరిచే విధంగా ఉన్నా సరే మార్కు 11:25లో పరమతండ్రి చెప్పిన విధముగా ఇతరుల తప్పులు మరచి పరమతండ్రితో సంబంధం కలిగి మన జీవితమును మధురంగా మార్చు కొంటున్నామా? మనలను హింసించు వారి కొరకు ప్రార్థిస్తున్నామా? ఇలా చేసినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన హృదయాల్లో నింపబడి సమస్త ద్వేషములు మరచి ప్రతి రోజు సంతోషంగా పండుగను జరుపుకొనగలము. ఆమెన్.

- సిస్టర్. ఏ. బ్యూలా గారు.

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం అనే దిన ధ్యాన పత్రిక ద్వారా అనేక మంది ఆత్మీయ జీవితం యొక్క నాణ్యత పెంచులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al