Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Saturday, 17-Dec-2022

దిన ధ్యానము(Telugu) 18.12.2022 (Christmas Special)

 

అంశం:- మారు మనస్సు పొందుటలో అర్థవంతమైన క్రిస్మస్.

 

"మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును" - లూకా 15: 7

 

ప్రియమైన పిల్లలు ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమముగా ఉండాలి అని ప్రభువుని వేడుకొంటున్నాను. ఈ సంవత్సరం ఇప్పుడే ప్రారంభం అయినట్టు ఉంది కాని గడగడమని గడిచిపోయింది చూసారా? ఈ నెల అంతా యేసయ్య కు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండాలి.

 

క్రిస్మస్ పండుగ అంటేనే క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత, ఇంటి అలంకరణలో చాలా బిజీగా వున్న సరే కొత్త డ్రెస్ కొనుటలో ఎవరు మరచిపోరు కదా! మీ అందరూ కొత్త డ్రెస్ కొనేసారా? సూపర్. కేనా అనే చిన్న పాప వాళ్ళ ఇంట్లో డ్రెస్ కొనుటకు డబ్బులు లేవు. వాళ్ళ నాన్న ఒక వారం అంతా దొరికిన పనులు అన్ని చేసి వచ్చిన డబ్బులతో తక్కువ ధరకు బట్టలు కుట్టించడానికి ఇచ్చారు. కేనా చాలా సంతోషించింది. టైలర్ ఆ పాప కొలతలను తీసుకొని ఆ క్లాత్ కట్ చేసింది. దానిని చక్కగా కుట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు కేనా వెయ్యవలసిన డ్రెస్ సూపర్ గా రెడీ అయిపోయింది. టైలర్ కు నాన్న డబ్బులు ఇచ్చి ఆ డ్రెస్ తీసుకొని కేనా కు ఇచ్చినప్పుడు కేనా సంతోషానికి హద్దులే లేవు. 

 

క్లాత్ ను తీసుకొని టైలర్ కు ఇచ్చిన విధముగానే మన జీవితమును కూడా దేవుని చేతిలో సమర్పించుకొందాం. అనవసరమైన క్లాత్ టైలర్ కట్ చేసిన విధముగా మనలో ఉండే కోపం, గొడవలు, అసూయ, అబద్ధం, దొంగతనం అనేటటు వంటి పాపములు తొలగించి యేసయ్య బిడ్డ వలె జీవించుటకు మనలను చక్క దిద్దుతారు. టైలర్ డ్రెస్ కుట్టుటకు ఫీజు తీసుకున్న విధముగా మన యొద్ద ఏ ఫీజు ఆయన తీసుకొనరు. బదులుగా ఆయన తన ప్రాణమునే ఫీజు వలె ఇచ్చుటకు ఈ భూమి పైకి వచ్చారు. 

 

పిల్లలు జీసస్ మీకు అడిగేది పాపముతో నిండిన హృదయమే. పాపపు చీకటిని తొలగించి పరిశుద్ధంగా జీవించే విధముగా మీ హృదయమును అర్పించుటకు నీవు సిద్ధమా? శుద్ధి గల హృదయముతో అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకొనుటకు నా శుభాకాంక్షలు.

 

కంఠత వాక్యం.

 

- సిస్టర్. దేబోరా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş