Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Saturday, 17-Dec-2022

దిన ధ్యానము(Telugu) 17.12.2022 (Christmas Special)

 

అంశం:- సంఘములలో అర్థవంతమైన క్రిస్మస్.

 

"విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు" - రోమీయులకు 14:1

 

ఒక కళాశాల క్యాంపస్ లో సేవలకు కొరకు ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ కళాశాలలో చదువుతున్న క్యాతలిక్ విద్యార్థులు ఆ సమావేశంలో పాల్గొనాలి అని ఆశపడి అందులో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన సేవకుడు క్యాతలిక్స్ గురించి మరియు వారు నడుస్తున్న మార్గం తప్పు అని అతను చెప్పిన మాటలు అక్కడ ఉన్న విద్యార్థులకు దుఃఖానికి గురిచేసాయి. ఎందుకు అంటే ఆ విద్యార్థులు తమ యొక్క భారమైన జీవితంలో ఉజ్జీవం వస్తుందేమో అని ఆశతో పాల్గొన్న వారికి ద్వేషమే మిగిలింది. ఆత్మీయ విషయాలు గురించి మరియు పరిశుద్ధాత్ముని గురించి ప్రసంగించినా సరే దానిని ఆ విద్యార్థులు అంగీకరించ లేకపోయారు. విగ్రహారాధన లేఖనములకు విరుద్ధం అయినప్పటికీ ప్రసంగించే విధానంలో క్రీస్తు ఆలోచన లేకపోవడమే దీనికి కారణం. 

 

పరిశుద్ధ గ్రంధంలో పేతురు కొర్నేలిని కలుసుకొనుటకు ముందు అతనిలో ఉన్న శారీరక ఆలోచన ఏమనగా అన్య జాతి వారితో సహవాసం చేయుట అయినను అట్టివాటిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదు అనునదే. కాని దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిసిద్ధమైన వాటిగా ఎంచ వద్దు అని దర్శనం ద్వారా తెలుసుకున్న తరువాత పేతురు తన ఆలోచనను మార్చుకున్నారు. తరువాత అన్య జాతి వాడైన కొర్నేలి ఇంటికి వెళ్లి అక్కడ కూడి ఉన్న వారికి సువార్తను ప్రకటించాడు. 

 

కొర్నేలి యూదులు అందరితో మంచి సాక్ష్యం పొందుకొని అనేకులకు ధర్మం చేసి యూదులకు పరిచయం గల వాడు. పేతురును గూర్చి చూసినప్పుడు అతను క్రీస్తును గూర్చి ప్రసంగించాడు. కాని యూదా ఆచారం ప్రకారముగా అన్య జాతి వాళ్ళ ఇళ్లకు వెళ్లాడు. అన్య జాతి ప్రజలను తన గృహం లోనికి ఆహ్వానించని వాడై యున్నాడు.

 

ప్రియమైన వారలారా! నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింప వలెను అనే ఆజ్ఞను పొందుకున్న మనం సంఘాలలో ఎన్ని విభజనలుగా విడిపోయి ఉన్నాం. మన వలె ఇతరులను ప్రేమించే మనస్సు మనకు ఉందా? ఇతరులతో మాట్లాడు తున్నప్పుడు వారు మనస్తాపం చెందకూడదు అని ఎంత వరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒకరిని గూర్చి ఇంకొకరి యొద్ద బ్రతిమలాడి మాట్లాడే మనస్సు మనకు ఉందా? దేవున్ని ఎరుగని ప్రజలు సంఘాల్లోనికి వస్తే వారిని మీతో పాటు చేర్చుకునే ఆశ మీకు ఉందా? ఇలా మనకు మనమే అనేక ప్రశ్నలను అడిగి వాక్య ప్రకారం మనలను ఎలా సరి చేసుకోవాలి అనే విషయాన్ని ఆలోచించి తెలుసుకొని నడుచుకొనుటకు మనం పిలువబడి ఉన్నాం. ఈ క్రిస్మస్ క్యాతలిక్ విద్యార్థులు క్రీస్తుని గూర్చి తెలుసుకొనుటకు ఆటంక పరచబడే విధముగా ఉండకుండ పేతురు కొర్నేలి వలె అన్య జాతులను ప్రేమించి ఆదరించే విధముగా ఉండును గాక! ఆమెన్.

- శ్రీమతి. ఏంజలిన్ గారు

 

ప్రార్థన అంశం:-

యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయబడుతున్న వేకువజాము ఆరాధన మరియు స్వస్థత నిచ్చు ఆరాధన మూలముగా అనేకులు దేవుని ప్రేమను రుచి చూచు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş