Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Thursday, 15-Dec-2022

దిన ధ్యానము(Telugu) 16.12.2022 (Christmas Special)

 

అంశం:- పిలుపును గూర్చి భయమా?

 

"తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" - మత్తయి 2:11

 

యోసేపు మరియు మరియ దంపతులకు ఒక సేవ పిలుపు ఇవ్వబడింది. అదే ఈ లోకంలో మెస్సయ్యను పెంచేటటువంటి పరిచర్య. ఈ. దంపతులు పేదరికంలో ఉన్నవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకే చోట వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించాలి అంటే చాలా కష్టం. యోసేపు ఒకే చోట వడ్రంగి పని చెయ్యలేక ప్రభుత్వ జనాభా కోసం బేత్లెహేము వెళ్ళవలసి వచ్చింది. హేరోదు కు బయపడి ఐగుప్తునకు వెళ్ళవలసిన పరిస్థితి. మరల ఇశ్రాయేలు దేశమునకు వచ్చి నజరేతులో ఉండవలసిన స్థితి. ఇలా జరుగుటను ఆయన ఎరిగి ఉన్నప్పటికీ బాధ్యత గల భర్త వలె తరువాత ఏం చెయ్యాలి అని ఆలోచించి యోసేపు కృంగి ఉండవచ్చు. మరియ కూడా వారికి ఉన్న అవసరతలు గూర్చి ఆలోచించి ఉండవచ్చు. ఈనాడు సేవా పిలుపును పొందుకున్న అనేకులు పరిచర్య చేస్తే నా అవసరతలు సంధింప బడతాయ అని ఆలోచించి కలత చెంది పరిచర్యకు వచ్చుటకు ఆలస్యం చేస్తున్నారు. చాలా మందికి పరిచర్య చెయ్యాలి అని ఆశ ఉంటుంది. ఆత్మలపట్ల భారం ఉంటుంది. కాని వారు పూర్తిగా పరిచర్యకు రాలేకపోవుటకు అడ్డంకి ఏమిటి అంటే భవిష్యత్తులో నా అవసరతలు సంధింపబడతాయా అనేదే. కాని ఈ దంపతులు ఈ ప్రశ్న అధిక బ్రమతో కూడిన భయాలను పెట్టుకొని ఈ సేవ పిలుపును నిరాకరించి లేదు. నీ చిత్త ప్రకారము జరుగును గాక అని పరిచర్యకు అంగీకరించారు. ఆ తరువాత ఏం జరిగింది శిశువు పుట్టిన కొన్ని వారాల్లోనే ఎక్కడో ఉన్న శాస్ర్తులు కూటముగా వచ్చారు. వీరు ఎవరు అని ఆశ్చర్య పడినంతగా వారు వచ్చి శిశువును నమస్కరించారు. అక్కడ కొంచం కూడా ఊహించని విధముగా ఒక కార్యం జరిగింది వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలగా ఇచ్చారు అని మనం చూస్తున్నాం. జన్మించిన యేసుక్రీస్తు పెంచడానికి ఐగుప్తుకు వెళ్ళడానికి ప్రయాణపు ఖర్చు, అక్కడ అద్దెకు తీసుకున్న ఇంటికి అడ్వాన్స్ ఖర్చు, మరియు అక్కడ వడ్రంగి పనిని మొదలు పెట్టుటకు డబ్బులు ఇలా అన్ని అవసరతలు సంధింప బడుటకు బహుమతులను దేవుడు ఈ కుటుంబానికి ఇచ్చారు. సేవ పిలుపును పొందుకున్న దేవుని ప్రియులారా! నా అవసరతలు సంధింప బడతాయ అని చెప్పి ఇంకా పరిచర్యకు రాకుండా వెనకడుగు వేస్తున్నారా? విశ్వాసముతో మొదటి అడుగు వెయ్యండి. మీ జీవిత అవసరతలు సందించుటకు తన నిధిని ఇచ్చి ఒక్క లోటు కూడా రాకుండా దేవుడు మిమ్మును నడిపిస్తారు. ఆమెన్.

- బ్రదర్. జె.సంతోష్ గారు.

 

ప్రార్థన అంశం:

ఆమెన్ గ్రామణ టీ. వి ద్వారా గ్రామాల్లో, సేవా స్థలాల్లో సువార్త ప్రకటింప బడులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet