Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Thursday, 15-Dec-2022

దిన ధ్యానము(Telugu) 15.12.2022 (Christmas Special)

 

అంశం:- స్టార్ న్యూస్

 

"నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు" - దానియేలు 12:3

 

క్రిస్మస్ అంటేనే ఇంటిని శుభ్రపరచడం, రంగులు వేయడం పశువుల పాక తయారు చేయడం , ఇంటి ముందు స్టార్ వేలాడదీయడం, కొత్త బట్టలు కొనుక్కోవడం ఇలా చాలా సంతోషంగా ఉంటాం. ఈరోజుల్లో క్రైస్తవులు మాత్రమే కాదు అన్యజనులు కూడా తమ ఇంటి ముందు స్టార్ ను వేలాడదీయుట చూసినప్పుడు సంతోషంగా ఉంటుంది. మనం మన ఇళ్లల్లో స్టార్ ను వేలాడదీసి వదిలేయకుండా ఆ నక్షత్రం యొక్క పనిని చేయుటకు అధిక బాధ్యత పొందుకున్నాము. 

 

క్రీస్తు జననంలో ఈ నక్షత్రం దేవుడు తనకు ఆజ్ఞాపించిన పనిని చక్కగా ప్రారంభించి శిశువు ఉండిన చోటికి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా వచ్చి నిలబడెను. ఆ నక్షత్రం ఆ జ్ఞానులను యేసుక్రీస్తు పుట్టిన చోటికి ఎలా నడుపించిదో అలానే మనము కూడా మన యొక్క జీవితంలో, మాట్లాడే మాటల్లో, నడుచుకున్న నడవడికలో ఇతరులను యేసయ్య చెంతకు నడిపించే ఒక నక్షత్రం వలె జీవించుటకే క్రైస్తవ జీవితం మనకు అనుగ్రహించబడింది. 

 

వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద బరితులైరి అని చదువుతున్నాం. ఈనాటి మన జీవితమును చూసి చుట్టూ వున్నవారు, తల్లిదండ్రులు, సంతోషిస్తున్నారా లేదా బాధ పడుతున్నారా? మనం మార్గ దర్శకులుగా మాత్రమే కాదు జీవించి చూపించే వారిగా వున్నట్లు అయితే ఇతరులు మనలను చూసి సంతోషంగా మనలను చేర్చు కుంటారు. లేదంటే మన యొక్క గుణమును చూసి తప్పుకొని ప్రక్కగా వెళ్ళిపోతారు. 

 

ఒక్కొక్క నక్షత్రమునకు నడిచే మార్గమును దేవుడు ఏర్పరచి ఇచ్చియున్నారు. కొన్ని నక్షత్రాలు మార్గం విడిచి త్రోవ తప్పినప్పుడు కాలి క్రింద పడుటను మనం చూడగలం. మనం కూడా దేవుడు ఏర్పాటు చేసిన త్రోవను విడిచి వెళ్లిపోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మనలను సమర్పించుకొంటే ప్రకాశించే నక్షత్రం వలె లోకంలో వెలుగుగా ఉంటాం. మన మనస్సులో స్ట్రాంగ్ గా ముద్రించబడిన స్టార్ న్యూస్ మన జ్ఞాపకంలో ఉండి మనలను దేవుని చిత్తమునకు నేరుగా నడిపించనిద్దాం. హల్లేలూయా!

- శ్రీమతి. పుష్ప సైమన్ గారు

 

ప్రార్థన అంశం:-

ఆసుపత్రి పరిచర్య మూలముగా సంధింప బడుతున్న వ్యక్తుల యొక్క స్వస్థత మరియు రక్షణ కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet