Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Monday, 12-Dec-2022

దిన ధ్యానము(Telugu) 12.12.2022 (Christmas Special)

 

అంశం:- నమోనాలో అర్థవంతమైన క్రిస్మస్.

 

"కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి" – 1 పేతురు 1: 15-16

 

ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. అతను విద్యార్థులు అందరితో మీ యొక్క రోల్ మోడల్ ఎవరు అని అడిగారు. దానికి అందరూ అబ్దుల్ కలామ్, గాంధీజీ, కిరణ్ బేడీ ఇలా చాలా మంది పేర్లు చెబుతున్నారు. ఒక విద్యార్థి మాత్రం లేచి జీసస్ అని అన్నాడు. తరగతి గదిలో ఉన్న అందరూ ఆ విద్యార్థి వైపు ఆశ్చర్యంగా చూసారు. 

 

ప్రియమైన వారలారా! మనం జవాబును చెప్పగలమా? మన యొక్క నడవడిక, వస్త్ర ధారణ, మరియు ప్రవర్తన ఎవరిని ప్రతి బింబిస్తున్నాయి. మనం ఎవరిని ఆదర్శంగా చేసుకుంటున్నాం? రాజకీయ నాయకులను, నటులు మరియు నటిమణులనా, క్రీడా కారులనా లేదా క్రీస్తునా కొంచం ఆలోచించి చూద్దాం. 

 

క్రీస్తు జన్మదినమున పండుగలా జరుపుకొంటున్న మనం ఆయన వలె ఉన్నామా? క్రీస్తు పిల్లలమైన మన యొద్ద ఆయన పోలిక ఆయన స్వభావం ఉన్నాయా? పరిశుద్ధ గ్రంధంలో కూడా పేతురును ఒకామె నీ మాటలు యేసుక్రీస్తు వలె ఉన్నవి అని చెబుతుంది. అవును కొన్ని సంవత్సరాలు యేసుతో కూడా ఉన్న పేతురు యొక్క మాటలు ఆయన వలె ఉన్నవి. కాని చాలా సంవత్సరాలుగా ఆయనను వెంబడిస్తున్న మన యొక్క మాటలు, నడవడిక ఎవరి వలె ఉన్నాయి అనేది కొంచం ఆలోచిద్దాం. 

 

యేసయ్య భూమి మీద జీవించిన రోజుల్లో పాపంతో నిండిన ఈ భూమి పైన ఎలా పరిశుద్ధంగా జీవించాలి అనేది జీవించి చూపించారు. ఆయన తన తల్లిదండ్రులతో కలసి జీవించిన కాలంలో వారికి లోబడి వున్నారు. ఎందునిమిత్తముగా తండ్రి ఆయనను పంపించారో దానిని సమాప్తం చేశారు. యేసు చుట్టూ వున్న వారు ఆయన మాటల ద్వారా మరియు కనికరం ద్వారా ఆకర్షింపబడ్డాడు. 

 

ఆయన వెలుగుగా జీవించారు. తనను తృణీకరించిన వారి పాపములు క్షమించారు. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న వారు నూతన సృష్టి అనే వాక్యం ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క మాదిరిగా జీవిద్దాం. 

 

కాని ఈనాడు చాలా మంది పాపమును తొలగించుటకు వచ్చిన క్రీస్తు యొక్క జన్మదినం పాపము అయిన మద్యం సేవిస్తూ మత్తులై జరుపు కొంటున్నారు. ఇది దేవున్ని దుఃఖ పరిచేటటువంటి విషయం. మారు మనస్సు చెంద వలసిన విషయాల్లో మారు మనస్సు చెందుదాం రాబోయే నూతన సంవత్సరంలో మనం అన్ని విషయాల్లో యేసుక్రీస్తు. మాదిరిని అనుసరిద్దాం. పరలోకంలో ప్రతి ఫలం పొందుకుందాం.

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు

 

ప్రార్థన అంశం:-

ప్రతి రోజు ఒకొక్క మిషనరీ 100 సువార్త పత్రికలను ఇస్తూ వస్తున్నారు. ఈ సువార్త పత్రికలను అందుకున్న వ్యక్తుల కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet