By Village Missionary Movement
Thursday, 08-Dec-2022దిన ధ్యానము(Telugu) 09.12.2022 (Christmas Special)
అంశం:- సొంత సహోదరుల మధ్య అర్థవంతమైన క్రిస్మస్.
"తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు" - 1యోహాను 4:20
అదికాండంలో ఇద్దరు వేరు వేరు సహోదరులను గూర్చి మనం చూద్దాం. ఒకరు ఏశావు, యాకోబు. తనను మోసగించి తన ఆశీర్వదములు అన్నింటిని తీసుకున్న యాకోబును స్వాగతించడానికి 400 మందితో ఏశావు వెళ్తున్నాడు. తన హృదయంలో ఉన్న భయముతో తన సహోదరునికి ముందుగానే బహుమతులు పంపిస్తున్నాడు యాకోబు. కాని ఏశావు పాత మోసాలు మరచిపోవడం వలన యాకోబును కౌగలించుకొని ఏడుస్తున్నాడు. బహుమతులను తీసుకోమని యాకోబు బలవంతం చేసినప్పుడు సహోదరుడా నాకు కావాల్సినంత ఉన్నది అని ఏశావు చెప్తున్నాడు. మనం మన తోడబుట్టిన సహోదరి సహోదరులును క్షమించి అంగీకరించి నప్పుడు దేవుడు కూడా మన లోటులను క్షమించి అంగీకరించి మనలను ఆశీర్వదిస్తారు.
రెండవదిగా కయ్యీను, హేబేలు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించడం వలన కయ్యినూలో అసూయ మరియు కోపము కలిగెను. హేబేలు యొక్క ఆశీర్వదమును అంగీకరించలేక అతనిని చంపెను. అది మాత్రమే కాకుండా దేవుని యొద్దనుండి శాపమును కూడా పొందుకొన్నాడు కయ్యీను. చూడండి మోసం చేసిన యాకోబును క్షమించిన సహోదరుడు ఒక వైపు మరో వైపు కయ్యినూ తన సహోదరుని చంపేశాడు.
ప్రపంచాన్ని చూసినట్లయితే సహోదరులు మధ్య కోపం, అసూయ, ద్వేషం, పగవంటివి అధికం అవుతూనే ఉండుటను జరుగుతున్న సంఘటనలు చూసి మనం తెలుసుకొంటున్నాం. నశించే శాశ్వతం కాని వాటి కొరకు న్యాయం పరిస్థితులు కలవు. ఒకరి యొక్క తప్పులను ఇంకొకరు క్షమించలేని స్థితిలో మనం ఉన్నాం. కాని కయ్యీను తన సహోదరుడై హేబెలును చంపేశాడు. ఈనాడు ఒక్క మాటతో ఇతరులను చంపేస్తున్నాం. సహోదరులు మధ్య సమాధానం లేనట్లయితే ఆయన మన కానుకలను అంగీకరించరు. మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము అటుతరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము అని యేసుక్రీస్తు చెబుతున్నారు. అలా అయితే మనం అనుకోవచ్చు నా వైపు తప్పే లేదు అతనే అన్యాయంగా మాట్లాడాడు అతను వచ్చి క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను. ఇలా మొదట ఎవరు క్షమాపణ అడగాలి అని ప్రశ్న వచ్చినప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఇద్దరిలో ఎవరు ఆత్మీయులో వారే మొదట సమాధానం కొరకు ప్రయత్నం చెయ్యాలి.
అవును ఈ క్రిస్మస్ కాలం సమాధానం కొరకు మనలను ద్వారం యొద్ద నిలబెట్టే కాలం. కాబట్టి దీని కొరకు కావాల్సిన గొప్ప కృపను దేవుని యొద్ద నుండి పొందుకొని ఆలస్యం చెయ్యకుండా నడుచుకుందాం. ఈ క్రిస్మస్ కాలం మన కుటుంబంలో అర్థవంతమైన క్రైస్తవులుగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక! ఆమెన్.
- శ్రీమతి. ఐడా కింగ్ డేవిడ్.
ప్రార్థన అంశం:-
గృహ ప్రార్ధనలను జరిగించుటకు తమ గృహాలను తెరచి ఇచ్చే కుటుంబాలు ఆశీర్వదించ బడేలా ప్రార్దిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250