Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Monday, 05-Dec-2022

దిన ధ్యానము(Telugu) 05.12.2022 (Christmas Special)

 

అంశం:- పరిచర్యలో అర్థవంతమైన క్రిస్మస్.

 

"ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను" - యోహాను 12: 26

 

అతను ఒక వృద్ధుడు. అతనికి 65 సంవత్సరాలు వయస్సు ఉంటుంది. అతని నడకలో ఒక గంభీరం, కాళ్లకు చెప్పులు ఉండవు. ఎల్లప్పుడూ పంచె కట్టుకొని ఉంటారు. ఒక భుజంపై సంచిలో ఒక బైబిల్, కంజీరాను, ఇంకొక భుజంపై తంబూరా మరియు వీపు పైన క్రింద పరుచుకొనుటకు ఒక గోనె సంచిని మరియు మార్చు కొనుటకు ఒక జత బట్టలు తీసుకొని ఎక్కడికైనా నడుచుకొనే వెళ్తారు. అందుబాటులో ఉంటే ఎద్దుల బండి ఎక్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు అంటే గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి. అతడు ఆ గ్రామాల్లో అడుగుపెట్టిన వెంటనే చిన్న పిల్లలు హే తాతయ్య వచ్చేసారు అని పరిగెత్తుకొని వస్తారు. ఆ తాతయ్య సాయంత్రం సమయంలో ఒక వీధి మధ్యలో ఉన్న వీధి దీపం క్రింద తన సామాన్లు పెట్టి తన దగ్గర ఉన్న గోనెను పరుస్తారు. పరిశుద్ధ గ్రంథమును, కంజీరాను తీసి బయట పెట్టి బిగ్గరగా పాడుతూ దేవున్ని స్తుతిస్తారు. చిన్న పిల్లలు అందరూ గుంపుగా కూర్చుంటారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా వచ్చి చుట్టూ నిలబడతారు. ఆయన ప్రసంగించడం మొదలు పెట్టి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు దయ్యాలు పారిపోతాయి, రోగులు స్వస్థత పొందుకుంటారు. కూటము పూర్తి అయిన వెంటనే ఎవరైనా వచ్చి అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని పిలిస్తే సంకోచం లేకుండా భోజనం చేస్తారు. చేశాక ఆ ఇంటిని ఆశీర్వదించి ఆ వీధిలో ఉన్న ఒక స్థలంలో గోనెను పరుచుకొని పండుకొని తన యొద్ద ఉన్న టవల్ కప్పుకొంటారు. వేకువజామున 4గంటలకు లేచి బిగ్గరగా ప్రార్దించి సమీపంలో ఉన్న నదిలోనైనను లేదా కొలనులోనైనను మరలా ప్రయాణం ప్రారంభిస్తారు. ఈయనే ఆరుమై నాయకం అనే బోధకుడు. మరుసటి రోజు వేరే ప్రాంతంలో ప్రసంగం మొదలు పెడతారు. అద్బుతములు జరిగితే తనకు కాక తండ్రికే మహిమ అనే మాటలో తన నోటి లోనుండి వస్తాయి. అక్కడ ఉన్న ప్రజలు ప్రేమతో బియ్యం, ఉల్లిపాయలు, మిరపకాయలు వంటివి అతనికి కానుకగా ఇస్తారు. వాటిని తీసుకొని ప్రక్క గ్రామంలో కష్టపడి బ్రతికే వారికి ఇచ్చేస్తారు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు. మా తాతయ్య చెప్పిన కథ ఇది. ఇది కథ కాదు నిజం. ఈయన ఉన్న రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి రోజు క్రిస్మసే. కొన్ని పేద వారి ఇళ్లల్లో అతను ఇచ్చిన వస్తువులతో క్రిస్మస్ ప్రారంభం అయింది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన స్నేహితులారా! దేవుని పరిచర్య అనేది మనుగడ సాగించుట కాదు. అది దేవుని పిలుపు. యేసుక్రీస్తు మనలను నిజాయితీ గల వారు అని భావించి ఈ ఉన్నతమైన పరిచర్యను ఏర్పరచి మనకు ఇచ్చారు. మనం ఆత్మల ఆదాయం చేస్తున్న ప్రతి ఒక్క రోజు మనకు క్రిస్మసే. అవును మన పరిచర్య అర్థవంతంగా ఉండాలి అంటే మనం సందించే వ్యక్తుల హృదయాల్లో యేసుక్రీస్తు జన్మిస్తారు. హల్లెలుయా!

- బ్రదర్. అనీష్ రాజా గారు.

 

ప్రార్థన అంశం:-

మన యొక్క భాగస్వాములు మరియు మనం నడిపిస్తున్న యవ్వనులు, చిన్న పిల్లలు ఈ క్రిస్మస్ ను అర్థవంతమైన క్రిస్మస్ గా అనుసరించేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş