By Village Missionary Movement
Sunday, 04-Dec-2022దిన ధ్యానము(Telugu) 04.12.2022 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం
అంశం:- ఇచ్చటలో అర్థవంతమైన క్రిస్మస్.
“అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును” - మత్తయి 25: 40
హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రిస్మస్ రాబోతుంది కొత్త బట్టలు కొనేసారా? క్రిస్మస్ ప్రోగ్రాం కోసం మీరు రెడీగా ఉన్నారా? సెలవు రోజుల్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సరే సరే మీ వలె కెటి, సెల్వి అనే ఇద్దరు పిల్లలు క్రిస్మస్ సెలవుల్లో ఇంటిని శుభ్రపరచడం, సాయత్రం ఆడుకోవడం, సైకిల్ తొక్కడం ఇలా చాలా జాలిగా ఉన్నారు. నీ క్రిస్మస్ కు నాన్నకు ఏ గిఫ్ట్ అడుగుతావు అని అడిగింది కెటి. నేను రిమోట్ కారు అడుగుతాను అని చెప్పింది సెల్వి. మరి నువ్వు ఏమని అడుగుతావు అని అడిగింది సెల్వి. నేనా కీబోర్డ్ అడుగుతాను అని చెప్పింది కెటి. సరే నాన్న వచ్చేవరకు సైకిల్ తొక్కుతూ అలా వెళ్లి వద్దాం అనుకొని వెళ్తూ ఉన్నారు. అప్పుడు చాలా పేద స్థితిలో ఉన్న రాబర్ట్ అంకుల్ చెత్త బండి తొక్కు కొంటూ వస్తున్నారు. అంకుల్ మీ అబ్బాయి రోహిత్ కు క్రిస్మస్ కు ఏ గిఫ్ట్ ఇస్తారు అని కెటి సెల్వి అడిగారు. వాడు చిన్న సైకిల్ అడిగాడు కాని నా యొద్ద సరిపడ డబ్బులు లేవు అందుకే కొనలేకపోయాను అని అన్నారు అంకుల్. సాయంత్రం నాన్న వచ్చి మీకు ఏ గిఫ్ట్ కావాలి అని కెటిని, సెల్విని అడిగారు. మీకు ఏ గిఫ్ట్ కావాలన్న నాకు చెప్పండి నేను కొని ఇస్తాను అని కూడా చెప్పారు. వెంటనే కెటి పరిగెత్తుకొని వెళ్లి తనకు కావలసిన గిఫ్ట్ ను నాన్న చెవిలో చెప్పింది. తరువాత సెల్వి కూడా అలానే అడిగింది. ఇద్దరు కూడా చిన్న సైకిల్ కావాలి అని అడుగుతున్నారు అని నాన్న ఆశ్చర్య పోయారు. వెంటనే వాళ్లిద్దరూ మన పక్క వీధిలో రోహిత్ కు సైకిల్ కావాలంట అని అనగానే నాన్నకు అంత అర్థం అయ్యింది. కాబట్టి నాన్న రోహిత్ వాళ్ళను క్రిస్మస్ కు రమ్మని పిలిచారు. వాళ్ళతో కలిసి చాలా బాగా క్రిస్మస్ జరుపుకున్నారు. రోహిత్ కు సైకిల్ కూడా కొని ఇచ్చారు. అప్పడు హద్దులు లేని సంతోషం వారి హృదయాల్లో నిండింది.
ప్రియమైన పిల్లలు మనం సంతోషంగా ఉండాలి అని దేవుడు తన కుమారుడ్ని మన కొరకు ఇచ్చారు. మనం కూడా ఈ క్రిస్మస్ రోజుల్లో పేదవారిని జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలు నెరవేర్చి అర్థవంతమైన క్రిస్మస్ ను జరుపుకుని దేవుని ముద్దు బిడ్డల వలె మారుదాం. సరేనా! ఏంటి పిల్లలు డిబ్బిలో ఉన్న డబ్బులు, పోకెట్ మనీతో లేని వారికి ఇచ్చి చూడండి పరలోకంలో మీ ఫలం అధికం అవుతుంది. సరే పిల్లలు అర్ధవంతమైన క్రిస్మస్ జరుపుకొనుటకు నా తరుపున క్రిస్మస్ శుభాకాంక్షలు.
సరే పిల్లలు ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం నేర్చుకొందమా?
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250