By Village Missionary Movement
Saturday, 03-Dec-2022దిన ధ్యానము(Telugu) 03.12.2022 (Christmas Special)
అంశం:- స్నేహితుల మధ్య అర్ధవంతమైన క్రిస్మస్
"త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి" - లూకా 2:16
దైవ కుమారుడు మనుష్యునిగా పుట్టిన శుభవార్త స్నేహితులకి తెలియజేయబడింది. అవును ఒకే స్థలంలో మందను మేపి వారి కొరకు ఆహారము వండుకొని భుజించి ఆదేస్థలంలో నివాస ముంటూ గొర్రెల కాపరులు అందరూ స్నేహితులే అనుటలో సందేహమే లేదు. స్నేహితులు ఎప్పుడూ తమలో తాము తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడూ వాయిదా వెయ్యరు దానిని త్వరగా నెరవేర్చుతారు. దీనిని ఏమి చేయాలి? దీనిని ఎవరికి ఇవ్వాలి అనే విషయాలపై పెద్దగా ఆలోచించరు. కాపరులు కూడా అంతే దేవదూత ఇలా చెప్పి వెళ్ళిపోయాడు ఈ గొర్రెల మందను ఎవరి సంరక్షణలో ఉంచాలి? ఎవరు వాటికి నీటిని అందిస్తారు అని ఆలస్యం చెయ్యకుండా శ్రద్ధగా పని చేశారు. అదేవిధంగా మనము కూడా మనం ఎరిగి ఉన్న దేవుని జన్మ దిన శుభవార్తను యేసుని ఎరుగని మన స్నేహితులకు తెలిపి వారు కూడా యేసుక్రీస్తు ను చూసేవారిలా వారిని నడిపించాలి. క్రిస్మస్ రోజున వారిని మీ ఇంటికి రమ్మని పిలిచి యేసు క్రీస్తు మీ హృదయంలోనికి వచ్చిన సాక్ష్యమును వారితో పంచుకొని దాని మూలముగా మీ హృదయంలో వచ్చిన ఆశీర్వాదములను తెలిపి మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పండి ఇటువంటి అవకాశం మరలా వస్తుంది అంటే నిశ్చయం ఏమిటి. గొర్రెల కాపరులు శిశువును గూర్చిన వార్తను బోధించారు. అవును ఇదే విధంగా మనము కూడా చెయ్యాలి. మీ క్రైస్తవ స్నేహితులు అందరూ నెలకు ఒకసారి మీకు సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్లి పరిచర్య చెయ్యండి. చిన్న పిల్లల పరిచర్య చేయుటలో సువార్త పత్రికలను అందించుటతో మొదలు పెట్టండి. అప్పడు ఎంత గొప్ప ఉజ్జీవం కలుగుతుందో మీరే చూస్తారు. మీరు నడిపించే పిల్లలను బోధకులుగా, మిషనరీలగా అభివృద్ధి చెయ్యండి. గొర్రెల కాపరులు దేవున్ని మహిమ పరిచారు. అవును స్నేహితులుగా మనం కూడా కలిసి ప్రార్దించి దేవున్ని మహిమ పరచవచ్చు. సాధారణంగా ఇది ప్రారంభించవచ్చు. కాని ఇద్దరు ముగ్గురు కలిసి చేసిన ప్రార్థన యొక్క ఫలితమును చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా ఉద్యోగ స్థలాల్లో, దుకాణాల్లో స్నేహితులతో కలిసి దేవుని కొరకు పనిచేద్దాం. అర్థవంతమైన క్రైస్తవునిగా అర్ధవంతమైన క్రిస్మస్ ను జరుపుకొందాం. హల్లేలూయా!
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.
ప్రార్థన అంశం:-
ఈ నెల అంతటిలో మన సేవా స్థలాల్లో జరగబోతున్న క్రిస్మస్ కార్యక్రమాలలో పాల్గొన్న వ్యక్తులు రక్షించబడేలా ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250