Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Thursday, 01-Dec-2022

దిన ధ్యానము(Telugu) 02.12.2022 (Christmas Special)

 

అంశం:- రోగులను పరీక్షించడంలో అర్థవంతమైన క్రిస్మస్.

 

“నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును” - మత్తయి 25:36

 

నేను పనిచేస్తున్న ఆసుపత్రిలో ఒక వృద్ధుడు ఊపిరి ఆడక చాలా బాధ పడుతున్నారు. ప్రతి రోజు ఉదయం ఆయన దగ్గరకు వెళ్లి తాతయ్య తిన్నారా? మీకు ఏమైనా కావాలా అని అడిగిన వెంటనే ఒక చిన్న పిల్లాడిలా ముద్దుగా ప్రేమగా సమాధానం చెప్పేవారు. హఠాత్తుగా ఒక రోజు ఆయనకు ఊపిరి పీల్చుకోవడంలో ఆయనకు కష్టం అయ్యింది. ఆ సమయంలో ఆయన నన్ను పిలిచి నాతో చెప్పిన ఒక విషయం నా హృదయాన్ని పగల గొట్టింది. దయచేసి నన్ను చంపేయండి. వ్యాధి వలన కలిగే బాధ కంటే ఈ ఒంటరి తనము వలన కలిగే బాధను నేను అస్సలు భరించలేక పోతున్నాను అని చాలా బాధపడుతూ అన్నారు. కరోనా కాలంలో చాలా మంది ఆసుపత్రిలో ఈ విధంగా ఒంటరిగా భయముతో జీవితమును తృణీకరించే స్థితికి గల కారణం వ్యాధి కాదు ఒంటరి తనమే. 

 

యేసుక్రీస్తు మనుష్యునిగా జీవించే కాలంలో 38 సంవత్సరాలుగా వ్యాధితో మాత్రమే కాదు కుటుంబీకుల ద్వారా విడువబడి తనను ఆ బేతెస్త అనబడిన కోనేరు యొద్దకు తీసుకొని వెళ్లి దించుటకు కూడా ఎవ్వరు లేరు అనే ఒంటరి తనంతో మిక్కిలి బాధకరమైన స్థితిలో ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దర్శించి ఏం చెప్పారో గమనించారా? స్వస్థ పడగోరుచున్నవా అని వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి యొక్క కోరికను అడుగుతున్నారు. చాలా కాలంగా వేచి యున్న అతని కోరికను అడిగిన యేసు ఆ కోరికను నెరవేర్చు లాగున అతనిని స్వస్థ పరిచారు. అతను వెళ్లి అనేకులకు యేసయ్యను గూర్చి ప్రకటించాడు అని పరిశుద్ధ గ్రంధంలో మనం చూస్తున్నాం. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఆ వృద్ధుని వలె చూచుటకు ఎవరు లేక చాలా కాలంగా వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు మన చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులలో, విధులలో, రోడ్డుపక్కన దిక్కులేని వారి వలె ఉండుటను మనం చూస్తున్నాం. ఇటువంటి వారికొరకు ఈ క్రిస్మస్ కాలంలో మనం ఏం చెయ్యబోతున్నాం? యేసుక్రీస్తు వలె వ్యాధి గ్రస్తులను విచారించి వారి కోరికను తెలుసుకొని వాటిని నెరవేర్చే విధముగా ఒక అర్ధవంతమైన క్రిస్మస్ ను మనం జరుపుకో బోతున్నమా? లేదా కేవలం తియ్యని ఫలహారాలు తిని మనం మాత్రమే క్రిస్మస్ సంతోషంగా జరుపుకో బోతున్నామా? కొంచం ఆలోచించి చూసి అర్థవంతమైన ఒక క్రైస్తవునిగా జీవించి అర్థవంతమైన క్రిస్మస్ ను జరుపుకుని దేవాది దేవున్ని సంతోష పరచుదుము గాక! ఆమెన్.

- డాక్టర్. విశాలీ గారు

 

ప్రార్థన అంశం:-

800 పైగా ఉన్న మన మిషనరీలు మరియు మిషనరీల కుటుంబాలు యొక్క క్రిస్మస్ అవసరతలు సందించబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom