By Village Missionary Movement
Tuesday, 29-Nov-2022దిన ధ్యానము(Telugu) 29.11.2022
అంశం:- చెర పట్టించు.
“మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవి ధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడియున్నాము” – 2 కోరింథీయులకు 10:5-6
ఒక యువకుడు నిశ్శబ్దంగా ధ్యానం చేసి దేవున్ని చూడాలి అని అడవికి వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చొని మరల ధ్యానం చేయడం ప్రారంభించాడు. చాలా మంది యవ్వన బాలికలు నాట్యం నేర్చుకోనుటకు అడవి మార్గం నుండి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్తున్నారు. వీరిని చూసాక ఆ యువకుని యొక్క ధ్యానం ఆటంక పరచబడింది. అందువలన అతను తన ముఖమును వస్త్రంతో కప్పుకొని మరలా ధ్యానం ప్రారంభించాడు. మరుసటి రోజు కూడా ఆ యవ్వన బాలికలు అదే మార్గంలో వెళ్తున్నారు. వారి కళ్ళకు ఉన్న గజ్జల శబ్దం ఆ యువకులను ఆటంక పరిచింది. వెంటనే చెవులను కూడా ఒక వస్త్రం తో కప్పుకొని ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. ఆ తరువాత రోజున వారు పెట్టుకున్న పువ్వుల వాసన అతనికి ఆటంకంగా వుండడం వలన ముక్కును కూడా కప్పుకున్నారు. మరుసటి రోజున అదే సమయంలో ఆ యవ్వన బాలికలు వెళుతూ ఉంటారు అనే ఆలోచన వచ్చింది. మనస్సును అదుపులోకి తీసుకోవడానికి పోరాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంధంలో మీ హృదయములో జీవ దారలు బయలు దేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని సామెతలు 4:23లో చదువుతున్నాం. ఇక్కడ హృదయం అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం రక్త మాంసం కలిగిన హృదయం గురించి మాట్లాడటం లేదు. మనస్సులో కలిగే ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి అని మనస్సును భద్రంగా కాపాడు కోవాలి అని సలహా ఇస్తున్నాము. మన యొక్క ఐదు జ్ఞానేంద్రియాలు అయిన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ద్వారా దేవునికి ఇష్టం అయిన పనులను చేద్దాం. దేవునికి ఇష్టం లేని పాపపు క్రియలను అనుమతించి నట్లయితే పాపపు పనులుగా బయలు పడతాయి. అప్పుడు ఆలోచనలను నిరోదించ లేము. కాని ఆ ఆలోచనలు నియంత్రిచ కుండా ఉంటే అవి మిక్కిలి గోరమైన ప్రభావము చూపుతాయి. అపోస్తులుడైన పౌలు కోరింధి సంఘమునకు పత్రిక వ్రాస్తూనప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలి అని వ్రాసారు. దీని ద్వారా పరిశుద్ధ గ్రంధం మనకు చెప్పే ఆలోచన ఏమిటి? పాపపు ఆలోచనలను అడ్డగించుటను క్రీస్తులో మనం నేర్చుకోవాలి అనేదే.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! పక్షులు మనపై నుండి ఎగురుటను మనం నిరోదించ లేము. కాని అవి మన తలపై గూడు కట్టుటను నిరోదించ గలము. మీ హృదయంలో గల ఆలోచన ఎలా ఉండబోతుంది.
- బ్రదర్. ఎల్. అలగర సామి గారు
ప్రార్థన అంశం:-
మన యొక్క క్యాంపస్ లో శిక్షణలో ఉన్న నూతన సేవకులు దేవుని కొరకు ఉత్సాహంగా సేవచేయాలి అని ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250