Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.11.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Monday, 28-Nov-2022

దిన ధ్యానము(Telugu) 28.11.2022 (Youth Special)

 

అంశం:- విలువ లేని ధనం.

 

యవ్వనుల కొరకు ప్రత్యేక సందేశం.

 

"మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును" - లూకా 12:34

 

యుద్దానికి బయలుదేరుతున్న అలెక్జాండర్ తన సైనికులను మరియు తన ప్రియమైన స్నేహితులను పిలిచి తన ఆస్తి అంతస్తులు మరియు తనకు కలిగిన అంతటిని విభజించి వారికి వ్రాయించి అప్పగించారు. తాను తన కొరకు ఏమియు ఉంచుకొనలేదు. అప్పుడు తన స్నేహితుడైన పెరిపికస్ నీ కొరకు ఏమియు లేదు అని అడిగినందుకు నా యొద్ద విశ్వాసం అనే గొప్ప నిధి ఉన్నది అన్నారు అలెక్జాండర్. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు అని సామెతలు 23: 18 వ్రాయబడి ఉంది. మీరు దేనిని కోల్పోయినా సరే దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని కోల్పోకండి. నమ్మడానికి ఏమి లేని సమయంలో వృద్ధులైన అబ్రాహాము మరియు సారా దంపతులకు వారి విశ్వాసము వలన యెహోవా వారికి ఇస్సాకును ఇచ్చి ఆకాశ నక్షత్రములు వలె వారికి సంతానమును ఇచ్చెను. తన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్న కీర్తనా కారుడైన దావీదు నీవే నా నిరీక్షణ అంటున్నారు. యోబు యొక్క జీవితంలో అనేక శ్రమలు, శోధనలు వచ్చినా సరే దేవుని పైన ఉంచిన విశ్వాసము నిమిత్తముగా రెండతలుగా పొందుకొన్నాడు. యోబు వలె మనము కూడా పూర్తి విశ్వాసమును కలిగి ఉన్నామా? 

 

ప్రభువు నందు ప్రియమైన వారలారా! మనం అందరం ఆలోచించ వచ్చు. నా కున్న పోరాటములు, జీవితంలో గందరగోళాలు, అప్పుల బాధలు, భయంకరమైన వ్యాధులు, వివాహ అడ్డంకులు, సంతానం లేకపోవడం, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ విభజనలు ఇవి అన్ని ఎవరికి తెలుసు? నేను ఎలా వీటన్నింటి మధ్యలో విశ్వాసంలో నిలకడగా ఉండగలను అనేటటువంటి అనేక ప్రశ్నలు మన మనస్సులో ఉండవచ్చు. కాని భక్తులు పాడినట్లుగా నేను నమ్ముటకు ఏమి లేకపోయినా నేను నా యేసయ్యను మాత్రమే నమ్ముతాను అని పాడండి. యిర్మీయా 29:11 లో చెప్పబడిన విధముగా నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతలు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధాన కరమైన ఉద్దేశములే గాని హాని కరమైన ఉద్దేశములు కావు. ఇదే యెహోవా వాక్కు అని ఉంది. మనలను సంపూర్ణంగా ఆయన పాదముల చెంత సమర్పించుకొని యేషయా40:31లో చెప్పబడిన విధముగా రెక్కలు చాపి పైకి ఎగురుదాం. హల్లెలుయా!

- శ్రీమతి. జాస్మిన్ పాల్

 

ప్రార్థన అంశం:-

మనం ప్రసారం చేస్తున్న టి.వి కార్యక్రమాలు అనేకులకు ఉపయోగ కరముగా వుండులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet