By Village Missionary Movement
Saturday, 19-Nov-2022దిన ధ్యానము(Telugu) 20.11.2022 (Kids Special)
అంశం:- జక్కయ్య అంకుల్.
“ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము” - ప్రకటన గ్రంథం 3: 20
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు బైబిల్ కథలు వినడం అంటే చాలా ఇష్టం కదా. అమ్మ ద్వారా మరియు సండే స్కూల్ టీచర్ ద్వారా చాలా బైబిల్ కథలు వినే ఉంటారు కదా. ఈరోజు కూడా బైబిల్లో జక్కయ్య అనే అంకుల్ గురించి తెలుసుకుందామా?
యెరికో అనే పెద్ద పట్టణం ఉండేది. ఆ పట్టణంలో జక్కయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ప్రజలు మాట్లాడుకొనే విషయాలు పట్టణంలో జరిగే అన్నింటి విషయాలు అతనికి బాగా తెలుస్తాయి. అదే విధముగా యేసయ్య గూర్చి కూడా విన్నారు. జక్కయ్య అంకుల్ తో అందరూ చెప్పారు అందువలన జక్కయ్య అంకుల్ కు యేసయ్య ను చూడాలి అని ఆశ కలిగింది. ఒక రోజు చాలా మంది ప్రజలు గుంపు కూడి యెరికో పట్టణమునకు వచ్చారు. ఏంటి విషయం అని జక్కయ్య అంకుల్ అడిగినప్పుడు యేసయ్య వస్తున్నారు అని అక్కడ ఉన్నవారు చెప్పారు. ఈ అంకుల్ కు యేసయ్యను చూడాలి అని చాలా ఆశగా ఉంది. కాని ఇతను చాలా పొట్టిగా ఉంటారు. అందువలన ప్రజల గుంపులో యేసయ్య ను చూడలేక ఏం చెయ్యాలి అని ఆలోచించారు. ఈ మార్గమునే కదా యేసయ్య వస్తారు నేను వెళ్లి ఆ మార్గంలో ఉన్న మేడి చెట్టు పైన ఎక్కి కూర్చుంటాను అని అనుకొని వేగంగా వెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నారు. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి పైకి చూసి జక్కయ్య అంకుల్ తో జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసినది అని చెప్పారు. వెంటనే నా పేరు యేసయ్య కు ఎలా తెలుసు అని అనుకుంటూనే సంతోషంగా దిగి వచ్చారు జక్కయ్య అంకుల్. ఇంటికి వెళ్తున్నప్పుడు యేసయ్య తో నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయంగా తీసుకొంటే అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని జక్కయ అంకుల్ చెప్పారు. యేసయ్య కూడా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చాలా సంతోషించారు.
ఏంటి పిల్లలు మీరు కూడా యేసయ్య తో మా ఇంటికి రండి అని హృదయ పూర్వకంగా ప్రార్థన చేస్తారా? అలా ప్రార్థిస్తే మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. సరేనా! సరే పిల్లలు మరి ఈరోజు ఒక కంఠత వాక్యం నేర్చుకుందమా?
ప్రకటన గ్రంథం 3: 20
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
- సిస్టర్. బ్యూలా గారు.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250