Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.11.2022
Share:

By Village Missionary Movement

Thursday, 17-Nov-2022

దిన ధ్యానము(Telugu) 18.11.2022

 

అంశం:- మనుష్యుడు మారితే ప్రపంచం మారుతుంది.

 

"అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను" - ఆదికాండము 32:28

 

ఒక బోధకుడు తన సంఘములో ఆరాధనకు ప్రసంగం సిద్ధపరుస్తూ వున్నారు. 6 సంవత్సరాల వయస్సు గల తన కుమారుడు అడుకొంటు శబ్దం చేస్తూ ఉన్నాడు. ఇది బొధకునికి చాలా బాధను కలుగజేసింది. కాబట్టి ఏం చెయ్యాలి అని ఆలోచించి తన బల్లపైన ఉన్న ప్రపంచ పటమును తీసుకొని దానిని ముక్కలు ముక్కలుగా చింపి తన కుమారుడికి ఇచ్చి దీనిని చక్కగా పేర్చి తీసుకొని రా నీకు బహుమతి ఇస్తాను అని చెప్పి పంపించేసారు. ఆ బాలుడు రెండు నిమిషాల్లో ఆ ప్రపంచ పటమును చక్కగా అతికించి తీసుకొని వచ్చాడు. నీవు ఇంత త్వరగా ఎలా సరిచేయగలిగావు అని అడిగారు ఆ బోధకుడు. ప్రపంచ పటం నేను పేర్చు తున్నప్పుడు దాని వెనుక భాగంలో ఒక మనుష్యుని రూపం ఉంది కాబట్టి నేను దానిని తిప్పి మనుష్యుని రూపం పేర్చడం మెదలు పెట్టాను ప్రపంచ పటము చక్కగా వచ్చేసింది అన్నారు. మనుష్యుని సరిచేస్తే ప్రపంచం చక్కగా మారుతుంది అని చెప్పారు. అందును బట్టి అతను ఆ రోజు ఆ విషయాన్ని తన సంఘంలో బోధించారు. ఇదే విధంగా యాకోబు తన జీవితం అంత చక్కగా కొనసాగుతుంది. అనుకున్నాడు. తన సహోదరుని మోసం చేసాడు తన తండ్రిని మోసం చేసాడు. దానికి ప్రతి ఫలముగా యాకోబు తన మామ ద్వారా మోసగించ బడ్డాడు. తరువాత తన సొంత దేశమునకు తిరిగి వస్తున్నప్పుడు యాకోబు ఏటి యొద్ద దేవున్ని కలుసుకుంటాడు. భార్యలు, పిల్లలు, గొర్రెలు, ఆస్తులు ఉన్నప్పటికీ ఇంకా మార్పు చెందని తన సహోదరుడైన ఏశావును గూర్చి భయపడ్డాడు. అప్పుడు అక్కడే ఒంటరిగా మిగిలి ఉండి దేవునితో పోరాడాడు. తన యొక్క పాత స్వభావములను, ఆలోచనలను విడిచిపెట్టమని దేవుడు చెప్పి ఉంటారు అనుకొంటున్నాను. మార్పు చెందిన యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చి వేశారు. ఆవిధంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తన సహోదరుడు కూడా తన పగను మరిచిపోయాడు.

 

దీనిని వింటున్న ప్రియ సహోదరుడా నీవు దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నవా? లోటు కలిగి ఉన్నాసరే ఆ లోటులను ఎత్తి చూపించి బాధపెట్టే వాడు కాదు దేవుడు. లోటులను ఎత్తి చూపించి సరిచేసే దేవుడై యున్నాడు. మాంస స్వభావములను మార్చి మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. మాంస స్వభావములు మార్చబడి ఆశీర్వదించబడుటకు సిద్ధముగా ఉన్నారా? లేదా మీరు ఇంకా పోరాడుతూనే ఉంటారా? నిర్ణయం మీ చేతుల్లో హత్తుకునే హస్తాలు ఆశతో చాపబడి యున్నవి. హల్లేలూయా!

- బ్రదర్. ఎల్. అలగర స్వామి గారు.

 

ప్రార్థన అంశం:-

హాస్పిటల్ మినిస్ట్రీ ద్వారా సందించ బడుతున్న వ్యాధి గ్రస్తులు శరీరంలో మరియు ఆత్మలో స్వస్థత పొందుకొను లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet