By Village Missionary Movement
Wednesday, 16-Nov-2022దిన ధ్యానము(Telugu) 17.11.2022
అంశం:- బస్సు లో నేర్చుకున్న పాఠం.
"పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను" - యాకోబు 5:20
నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాను చోటు లేకపోవటంతో మెట్ల దగ్గర కూర్చొని ఆ మెట్ల పై నా బ్యాగ్ ని పెట్టాను. అది గమనించిన ఒక పెద్దాయన నన్ను పిలిచి మీ బ్యాగుని బస్సు లోపల పెట్టండి లేకపోతే అది క్రింద పడిపోతుంది అని అన్నారు. నేను ఇంతకు ముందు ఎప్పుడు అతనిని చూడలేదు కాని అతను చేసిన పని అభిమానముతో నిండినదై యున్నది. నేను ఎవరో తెలియకపోయిన అతని యొక్క ఆప్యాయత నాయందు బయలు పడింది. వెంటనే నాలో ఏర్పడిన గ్రహింపు ఏమనగా నా చుట్టూ నశించిపోతున్న వారికొరకు ఈ విధముగా నేనేమైనా చేస్తున్నానా అని ఆలోచించాను.
ఈనాడు కూడా మన కన్నులముందు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. త్రాగుడు, వ్యభిచారం, వేశ్యతనం, మత్తు ఇలా అనేకరకాల పాపాల్లో చిక్కుకొని నాసనమునకు నేరుగా వెళుతూ ఉన్నారు. వారి యందు క్రీస్తును అంగీకరించిన మన యొక్క దృష్టి ఎలా ఉంది. మరణము తరువాత జీవితం న్యాయతీర్పు నిత్యజీవితం, నరకం వీటన్నింటిని ఎరిగిన మనం వారికొరకు ఏమి చేస్తున్నాం. వారిని కాపాడాలి అనే ఆలోచన మనలో ఉందా?
యేసుక్రీస్తు లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక ఉపమానమును చెప్పాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెల్లుచూ దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచి పోయిరి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయేను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచూ అతడు పడియున్న చోటికి వచ్చి అతని మీద జాలిపడి అతని గాయములను కట్టి అతనిని వాహనము మీద తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. అవును ఈ ఉపమానం మనకు చెప్పే ఇంకొక సత్యం ఏమనగా నిత్యం మరణము వైపు వెళ్తున్న వారిపై కనికరపడి, వారి గాయములను కట్టి దేవుని చెంతకు నడిపించాలి అనేదే ఆత్మ ఆదాయం అలా చేయటం మన భాద్యత.
ఎవరో తెలియని ఒక పెద్దాయన న వస్తువులపై జాగ్రత్త వహించుట అభిమానం అని మనం చెప్పినట్లైతే క్రైస్తవులం అని పిలవబడే మన హృదయంలో ఆత్మభారం లేకపోవటం ఏమిటి దేవున్ని ప్రేమించే ఒకడు ఆత్మల ఆదాయం చేయలేకుండా ఉండలేడు. సువార్తను ప్రకటించటం మన భాద్యత. ప్రకటించకపోతే మనకు శ్రమ కాబట్టి ఆత్మల ఆదాయం చేద్దాం. నరకపు జీవితం నుండి ప్రజలను త్రిప్పి క్రీస్తు చెంతకు చేర్చుదాం హల్లేలూయా!
- సహోదరుడు. విలియమ్స్
ప్రార్థన అంశం:-
ప్రతిరోజు 100 సువార్త పత్రికలను మన మిషనరీలు అందిస్తున్నారు. వీటిని అందుకున్న వారు యేసును అంగీకరించేలా ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250