Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.11.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 15-Nov-2022

దిన ధ్యానము(Telugu) 16.11.2022

 

అంశం:- ఆశీర్వాదకరమైన జీవితం కొరకు.

 

"ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా?” – 1 సమూయేలు 15:22

 

క్రైస్తవ జీవితంలో విధేయత అనేదే అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు తమ సంతతికి ఆశీర్వాదకరముగ జీవించుటయు లోబడని వారు తమకు మాత్రమే కాదు తమ సంతతికి శాప కరముగ మారుటయు పరిశుద్ధ గ్రంధంలో మనం చూడవచ్చు. ఉదాహరణకు అబ్రాహాము లోబడుట వలన భూమి మీద ఉన్న వంశములలో అతని సంతతి ఈనాటి వరకు ఆశీర్వాద కరముగ ఉండుట మనం చూస్తున్నాం. ఆగగు రాజు యొక్క అవిధేయత వలన అతని ఉన్న సమస్తమును నిర్మూలము అగుట మనం చూస్తున్నాం. ఈనాడు సౌలు యొక్క అవిధేయత వలన కలిగిన సంగతులను మనం చూద్దాం. 

 

యెహోవా సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో అమలేకీయులను వారికి కలిగిన సమస్తమును నిర్మూలము చేయమని సెలవిచ్చెను. కారణం ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు వారికి విరోధముగా మార్గమందు వారి మీదకి వచ్చినది నాకు జ్ఞాపకమే. కాబట్టి వారిని నిర్మూలము చేయుము అని చెప్పారు. కాని సౌలు యెహోవా మాటకు లోబడకుండా అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని క్రొవ్విన గొర్రెలను యెడ్లను నిర్మూలము చేయలేదు. స్వల్ప కార్యం కొరకు ఆయన మాటకు లోబడని సౌలును రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపం చెందుటను మనం చూస్తున్నాం. అవును సౌలు యొక్క చిన్న అవిధేయత రాజు స్థితిని కోల్పోయేలా చేసింది. ఈనాడు కూడా ప్రభువు మనకు పని చేసే స్థలములో సమాజంలో, సంఘంలో సౌలు వలె ఉన్నతముగా ఉంచి ఉండవచ్చు. కాని అనేక సమయాల్లో ఈ ఉన్నత స్థితి దేవుడు ఇచ్చినది అని గ్రహింపక మనుష్యులను సంతోష పరుచుటకు దేవున్ని వెనక్కి త్రోసివేసి మనస్సుకు నచ్చిన దానిని చేసిన వారి వలె ఉన్నామా? ఆలోచించి చూద్దాం. అవిధేయత వలన మహిమను కోల్పోవుటకు ఎంతో సమయం పట్టదు. నేను మనుష్యులను సంతోష పరుస్తారు లేక దేవున్ని సంతోష పరుస్తాను అనే ప్రశ్నను విని దేవుని మాటకు మొదటి స్థానం ఇచ్చుటకు తీర్మానము తీసుకుందాం. ఇదే సమయంలో మనం యేసుక్రీస్తు యొక్క విధేయతను మనం కచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుని స్వరూపం కలిగియుండి సిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. త్రియేకంలో ఒకరైన యేసు క్రీస్తుకే విధేయత అంతగా అవసరం అయితే మనకు మరి ఇంకా ఎంత అవసరం? 

 

ప్రియమైన వారలారా! విధేయత మనకు మాత్రమే కాదు మన సంతతికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని మరచిపోవద్దు. యోనా యొక్క అవిధేయత సముద్రంలో తుఫానుకు కారణం అయ్యింది. నేను తప్పు చేశాను అని యోనా ఒప్పుకున్న విధముగా మనలను మనం దేవుని సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరం అవుతుంది. హల్లెలుయా!

 

శ్రీమతి. నిరోషా ఆల్విన్ గారు

 

ప్రార్థన అంశం:-

7000 గృహ ప్రార్థన బృందాలను దేవుడు ఏర్పరుచు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al