Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.11.2022
Share:

By Village Missionary Movement

Monday, 14-Nov-2022

దిన ధ్యానము(Telugu) 15.11.2022

 

అంశం:- కాపాడును గాక!

 

"అందుకు నాబోతు-నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా" - 1 రాజులు 21:3

 

ఒక ఊరిలో రక్షన్య అనే పేరుతో ఒక పాఠశాల చాలా సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ప్రతి రోజు ఉదయం చక్కనైన పాటలను నేర్పిస్తారు. అన్య జాతికి చెందిన ఒక పరిపాలకుడు మిక్కిలి అధికమైన డబ్బును ఇచ్చి ఆ స్కూల్ ను కొన్నాడు. పాఠశాల యొక్క లక్ష్యమే మారిపోయింది. ఆ స్కూల్ స్థాపడు పరలోకంలో ఉన్న ఆశీర్వదాలను అల్పముగా ఎంచి లోకపు డబ్బుకొరకు అమ్మేశాడు. ఆలోచిస్తే అది ఎంతటి బాధకరం. ద్రాక్ష తోట కూర తోట వలె మారిపోయింది. పితరుల ద్రాక్ష తోట నాబోతుకు చెందినది దానిని అహాబు రాజు కూర తోటగా మార్చాలి అని ఆశ పడ్డాడు. కాబట్టి దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకు ఇచ్చెదను లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకు ఇమ్మని రాజు నాబోతును అడిగినప్పుడు ఇది పిత్రార్జితము అని నాబోతు సమాధానం ఇచ్చాడు. నా పితరులు కనాను దేశంలోనికి వచ్చినప్పుడు ఈ వారసత్వమును పొందుకొనుటకు 31 మంది రాజులతో యుద్ధం చేశారు అని గుర్తు చేసుకొని ఉండి ఉంటాడు. నాబోతు రాళ్లతో కొట్టబడినప్పటికి తన వారసత్వాన్ని వదులుకోలేదు. 

 

దేవుని పిల్లలారా! ఆ కనాను దేశపు వారసత్వం కంటే ప్రభువు ఇచ్చే వరాలు, ఫలాలు వంటి విలువైన వాటిని సొంతం చేసుకొనండి. అనేక సమయాల్లో వీటి కొరకు మనతో బేరం మాట్లాడుటకు ఈ లోకపు అధిపతి అయిన అపవాది వస్తాడు. నశించే లోకపు ఖ్యాతిని చూపి నశించని, వాడబారని వారసత్వం దొంగిలించాలి అని అనుకుంటాడు. కీర్తన 119:111లో నీ శాసనములు నాకు హృదయనంద కరములు అవి నాకు నిత్య స్వాస్యైం అని భావించు చున్నాను. అని చెప్పిన కీర్తనా కారుని వలె పితరుల వారసత్వం కాపాడుకొనుటకు పోరాడిన నాబోతు వలె మనము కూడా యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా మనం పొందుకొనిన నిత్యమైన వారసత్వమును, ఆత్మీయ వరములను కోల్పోకుండా కాపాడుకుందాం. 

- సిస్టర్. ఏ. బ్యూలా.

 

ప్రార్థన అంశం:-

ప్రతి సేవా స్థలములలో నెలలో ఉన్న 30 రోజుల్లో 30 గృహ కూటములు జరుగులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al