Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.11.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Monday, 14-Nov-2022

దిన ధ్యానము(Telugu) 14.11.2022 (Youth Special)

 

అంశం:- విశ్వాసముతో కూడిన ప్రార్థన

 

యూత్ స్పెషల్.

 

"విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును" - యాకోబు 5:15

 

సెల్వం అనే బాలుడు 11 ఏళ్ళు నిండిన ఒక అనాధ. అతడు అపరిశుభ్రమైన విధులలో నివసించడం వలన అతనికి భయంకరమైన వ్యాధి సోకింది. వ్యాధి తీవ్రత వలన తన శరీరంలో గల ఒక అవయవమునకు శస్త్ర చికిత్స చేస్తేనే అతడు బ్రతుకుతాడు అని వైద్యులు చెప్పేసారు. సెల్వం ప్రార్ధించే అలవాటు కలవాడు. గొప్ప సద్గుణాలు కలిగినవాడు. వైద్యులు కూడా అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. చికిత్స కు ముందు ఆ బాలుడు చేసిన పని అతని నైపుణ్యానికి ఒక పెద్ద సవాలు అని వైద్యులు గ్రహించారు. సెల్వం విశ్వాసముతో మోకాళ్ళు వేసి నాకు ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ కు సహాయం చేయుము అని ప్రార్ధించాడు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను అని 1కోరింది 2:4 వ్రాయబడి ఉన్న వాక్యం డాక్టర్ చేస్తున్న చికిత్స విజయవంతంగా చేసి ముగించుటకు కారణం అయ్యింది. సెల్వం యొక్క విశ్వాసముతో కూడిన ప్రార్ధనే అని ఎరిగి డాక్టర్ దేవున్ని స్తుతించారు. 

 

పరిశుద్ధ గ్రంధంలో దానియేలు అనే ప్రార్ధన వీరుడు గూర్చి చూస్తున్నాం. రాజు ఆజ్ఞను మీరి దినమునకు ముమ్మారు మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు సింహాల గుహలో పడద్రోయబడినా సరే ఎటువంటి హానియు కలుగకుండా విడుదల పొందుకొన్నాడు. ఎందుకు అనగా దానియేలు అనుదినము తప్పక సేవించు దేవుడే తనను రక్షించును అని రాజే సాక్ష్యం చెప్పాడు. 

 

ప్రియమైన వారలారా! దీనిని చదువుతున్న మీలో ఎటువంటి విశ్వాసం ఉన్నది? అన్ని విషయములలో ఆయన పైన ఆనుకొని పైన విశ్వాసం ఉంచామా? లేదా దేవునికి మరియు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇది జరగదు ఇలా జరగడం అసాధ్యం అని అవిశ్వాసంతో ఉన్నామా ఆలోచించి చూద్దాం. సెల్వం వలె మనము కూడా దేవుని పైన ఉంచిన విశ్వాసమును ఇతరులకు పంచుదాం. విశ్వాసము యొక్క శక్తితో మనము ఆనందం పొందుకుందాం. హల్లేలూయా!

- శ్రీమతి.జాస్మిన్ పాల్ గారు

 

ప్రార్థన అంశం:-

గ్రామాల్లో ట్యూషన్ సెంటర్ ద్వారా సంధింప బడుతున్న ప్రతి ఒక్క చిన్న పిల్లలు దేవుని ప్రేమను గ్రహించులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al