By Village Missionary Movement
Wednesday, 17-Feb-2021దిన ధ్యానము(Telugu) 17.02.2021
"వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించెను" - అపో.కార్యములు 21: 26
ఈ దినము భస్మ బుధవారం ప్రపంచం అంతా కూడా అన్ని క్రైస్తవ సంఘాలలోను ఈ దినాన్ని ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారు. ఎంత విశేషముగా ఏర్పడిందో చూద్దాం.
మొట్టమొదటిగా క్రీ .శ 360 వ సంవత్సరం నుండి క్రైస్తవ సంఘాలలో ఆచరించబడడం ప్రారంభంఅయ్యిందని సంఘ చరిత్ర చెప్తుంది. 5వ శతాబ్దంలో పోప్ కిరిక్ కోరియన్ అనే వ్యక్తి ద్వారా కతొలిక సంఘాలలో భస్మ బుధవారం అనేది క్రమముగా ప్రతి సంవత్సరము ఏర్పరచబడిన దినముగా మార్చబడింది. మొదటిలో 40గంటల సమయము తరువాత 6 దినాలు అని మారి తరువాత 21 దినాలు అని అనుసరించడం జరిగింది ఒకానొక సమయంలో భస్మ బుధవారం మొదలుకొని 41 దినాలు ఉపవాసము శరీరాన్ని నలుగగొట్టుకొనుట పాటిస్తూ వస్తున్నారు. వీటినే శ్రమ దినాలు అని కూడా అంటారు. మట్టలాదివారము ఆ దినము వాడుతున్న మట్టలను భద్రముగా దాచిపెట్టి వచ్చే సంవత్సరానికి దానిని కాల్చి దానిని సిలువకు గుర్తుగా వచ్చిన భూడిదను నుదుటమీద రాసుకునే ఆచారము , ఒక సంఘములో అలవాటుగా ఉండేది.
పైన ఉన్న సందేశాన్ని బైబిల్ కోణంలో మనం చూచినయెడల మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవాల్సిన దినము ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట చుట్టుకొని, ఉపవాసమా అట్టి ఉపవాసము, దేవునికి ప్రీతికరమైనది అని మీరనుకొందురా? అని (యెషయా58:5) లో చదువుతున్నాం. మన ప్రభువు ఉపవాసం గురించి శరీరాన్ని నలుగగొట్టుట గురించి బైబిల్లో అనేక చోటుల్లో తేటగా మనకు చెప్పి యున్నారు. అనేక కాలాలుగా సంఘములో పాటించబడుతూ వస్తున్న ఈ ఆచరణ బాహ్యంగా నిలబడిపోకుండా అంతరంగ మనుష్యులలో కూడా మంచి మార్పులతో జరిగించ బడాలి అన్నది ప్రాముఖ్యం. ఉత్తినే భూడిదలోను, మట్టిలోను మన భక్తిని చూపించటం సరియైనది కాదు. మన హృదయంలో ఏర్పడుతున్న మార్పు నే మన యొద్ద దేవుడు ఎదురు చూస్తున్న కార్యం.
ప్రియమైన వారలారా! మరియు ఒక వాక్యాన్ని ఈ దినం సందేశంతో కలిపి చెప్తున్నాను బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు, బాహ్యమైన సున్నతి సున్నతి కాదు , అయితే అంతరంగ మందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధ మైనది, ఆత్మ యందు జరుగుతున్నదే కాని అక్షరము వలన కలిగినది కాదు. (రోమీలకు వ్రాసిన 2:28,29) లో చదువుతున్నాం. అవును దీనినే దేవుడు మన యొద్ద ఎదురు చూస్తున్నారు. వాక్యారీతిగా బాహ్యములో జరుగుతున్న ఆచారాలు చూచి దేవుడు మోసపోతున్నవాడు కాదు, మనం దీనిని గ్రహించిన వారుగా మన యొక్క తండ్రియైన దేవునిని ఆత్మ తోను సత్యముతోను ఆరాధించ బద్ధులమై యున్నాం.
- పి.జాకబ్ శంకర్
ప్రార్ధనా అంశం:-
ఆకలిగాలవారికి ఆహారము అనే ప్రణాళిక ద్వారా మేలు పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా పరలోక ప్రజలుగా మారేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250