By Village Missionary Movement
Thursday, 10-Nov-2022దిన ధ్యానము(Telugu) 11.11.2022
అంశం:- ప్రయాసకు తగిన ప్రతి ఫలము.
"కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి" – 1 కోరింథీయులకు 15:58
ఒకరోజు ఆదివారం ఆరాధన ప్రారంభమునకు ముందు ఆ సంఘ పెద్ద వృద్ధుడైన బోధకుడ్ని చూసి బోధకుడా మీ ప్రసంగములో, పరిచర్యలో ఏదో లోటు ఉండి ఉండాలి. ఈ సంవత్సరం అంత ఈ సంఘమునకు ఒకే ఒక్కరు మాత్రమే వచ్చారు అందులో వాడు చిన్నవాడు అని బాధ పెట్టె విధముగా మాట్లాడారు.
ఆ రోజు బోధకుడు మనస్సు పగిలిన వారై సంఘము ముందు వాక్యమును బోధించారు. ఆరాధన ముగిసింది అతను పరిచర్య విడిచిపెట్టాలి అని అనుకున్నారు. అందరూ వెళ్లిపోయిన తరువాత కొత్తగా వచ్చిన ఆ చిన్నవాడు బోధకుడు యొద్దకు వచ్చి నేను చాలా ఎక్కువగా కష్టపడి చదివి ఒక ప్రసంగికునిగా లేదా సువర్తికునిగా ఉండ గలన అని అడిగాడు. బోధకుడు కళ్ళల్లో కన్నీళ్లతో ఆ చిన్న వాడిని చూసి దేవుని హస్తము నేను ఇప్పుడే చూస్తున్నాను నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక! నీవు ఒక ప్రసంగికుడవు అవుతావు అన్నారు.
చాలా సంవత్సరాల తరువాత వృద్ధుడైన ఒక సువర్తికుడు ఆఫ్రికా నుండి లండన్ కు వచ్చారు. అతని గూర్చి ప్రజలు ఈ విధముగా మాట్లాడుకున్నారు. ఆఫ్రికా యొక్క మిక్కిలి ఘోరమైన స్వదేశ నాయకులకు చెందిన ఎన్నో ఆత్మలను అతని సంఘమునకు చేర్చుకున్నారు. అతని పేరు రాబర్ట్ మోప్పత్ అంట. చాలా సంవత్సరాలు క్రితం స్కాట్లాండ్ ఆదివార ఆరాధనలో ఆ బోధకుడితో మాట్లాడిన ఆ చిన్న వాడే ఈ రాబర్ట్ మోప్పత్ అని మాట్లాడుకున్నారు.
క్రీస్తు నందు ప్రియమైన వారలారా! దేవుని యందు ప్రయాసపడి సేవచేసి అలసిపోయి ఉన్నారా? మీ ప్రయాసలను మీ క్రియలను మరువని దేవుడు మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు. శిష్యుడు అని ఎవడు ఈ చిన్న వారిలో ఎవరికి గిన్నెడు చల్ల నీళ్లు త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని మత్తాయి 10:42లో వ్రాయబడి ఉన్నది. మనం చేస్తున్న పనులలో వెంటనే గొప్ప ఫలితం కలుగకపోవచ్చు లేదా ఇతరుల దృష్టిలో మనం అల్పముగా ఉండవచ్చు. వీటన్నింటిని చూసి కృంగిపోకూడదు. విత్తువానికి విత్తనమును, తినుటను ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యం కలుగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందిచును అనే వాక్యం ప్రకారముగా దేవుడు మిమ్మును లోటు లేకుండా నడిపిస్తాడు. మీరు విశ్వసించి నట్లయితే మంచి కోతను చూస్తారు అలానే మంచి ఫలితం పొందుకుంటారు. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.
- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.
ప్రార్థన అంశం:-
యవ్వన బాలుర కొరకు తమిళ్లో యెహోషువ లెమ్ము అనే పత్రిక అనేకులకు ఉపయోగకరముగ వుండులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250