Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.11.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 08-Nov-2022

దిన ధ్యానము(Telugu) 09.11.2022

 

అంశం:- స్వబుద్ది.

 

"నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము" - సామెతలు 3:5

 

ఒకానొకప్పుడు వృద్ధుడైన గురువు యొద్ద రాజ వంశానికి చెందిన అనేకులు శిక్షణను పొందుకొని తమ దేశాలను సమర్థవంతముగా పరిపాలిస్తూ వస్తున్నారు. ఆ గురువుకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. తన కుమారుడి యొక్క భవిష్యత్తు గురించి చింతిస్తూ తన యొద్ద శిక్షణ పొందుకున్న పక్క దేశపు రాజు యొద్దకు తన కుమారుడ్ని పంపించారు. తన కుమారుడుకు ఒక చిన్న మూట ఇచ్చి దానిని రాజుకు ఇవ్వమని చెప్పారు. వెళ్తున్న దారిలో తండ్రి తనకు ఇచ్చిన మూటలో ఏముందో చూద్దాం అని విప్పి ఆశ్చర్యపోయాడు ఆ కుమారుడు. అందులో కర్ర, చెక్కతో చేసిన కత్తి మరియు పాత బడిన వస్త్రం ఉన్నాయి. ఈ వస్తువులను రాజుకు ఎలా ఇవ్వాలి అనుకొని తన సామర్ధ్యం ఉపయోగించి కొత్త వస్తువులు చేసాడు. సమయానికి రాజ భవనమునకు చేరుకున్నాడు. 

 

ఆ కొత్త వస్తువులను కాపలా దారులకు ఇచ్చి పంపించాడు. రాజు యొద్దనుండి ఎటువంటి జవాబు రాలేదు. చాలా గంటల సమయం వేచి ఉన్న తరువాత వేరే దారి లేక తన తండ్రి ఇచ్చిన మూటను కాపలా దారునికి ఇచ్చి పంపించాడు. కొన్ని నిమిషాల్లో రాజే రాజ భవనము యొక్క ద్వారము నొద్దకు వచ్చి తనను హత్తుకొని రాజ భవనమునకు తీసుకొని వెళ్లారు. రాజు ఆ మూటలో ఉన్న వస్తువులను చూపిస్తూ ఈ కర్ర నేను తప్పు చేసినప్పుడు నన్ను మంచి మార్గంలో నడిపించింది. నా చేతులు ఈ చెక్క కత్తితోనే శిక్షణ పొందాయి. ఒక సారి గోతిలో పడి చిక్కుకొని వున్నప్పుడు ఈ వస్త్రాన్ని నాకు అందించి గురువు నన్ను కాపాడారు. ఇవి అన్నియు నాకు చాలా విలువైన వస్తువులు అని చెప్పి ఈ వస్తువులు మొదట నీవు నాకు ఇచ్చి ఉంటే ఎప్పుడో నీవు రాజ భవనములోనికి వచ్చి వుండేవాడివి అని అన్నారు. మంచి పేరు సంపాదించాలి అని తన సొంత బుద్దిని వృధా చేసాను అని కుమారుడు బాధపడ్డాడు. 

 

పరిశుద్ధ గ్రంధంలో లూకా సువార్త 5:2-11 వచనాల్లో పేతురును గూర్చి మనం ధ్యానించవచ్చు. పేతురు చేపలు పట్టుటలో మంచి నైపుణ్యం గలవాడు. దానిని గూర్చిన ప్రతి విషయం ఎరిగినవాడు. రాత్రి అంతా ప్రయాసపడి ఏమియు దొరకక పోవడం వలన అలసిపోయి వలలను కడుగుచున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు పేతురు యొక్క దోనె ఎక్కి కూర్చున్నారు. నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయుడని యేసయ్య చెప్పినప్పుడు తన స్వబుద్దితో మాట్లాడ కుండా మీ మాట చెప్పున వలలు వెతును అని ఆయన మాటకు లోబడి పనిచేసినప్పుడు వలలు పిగిలి పోవునంతగా చేపలు పట్టాడు.

 

అవును దేవుని పిల్లలారా చదువులో, ఉద్యోగ విషయంలో పరిచర్యలో మన సొంత బుద్దిని లేదా మనుష్యులను నమ్మి క్రీస్తును మరచి అనేక సమయాల్లో అపజయాలను ఎదుర్కొని ఉండవచ్చు. మనలో ఉన్న స్వార్థం అనే శరీరానుసారమైన కార్యం క్రీస్తును దాచి పెట్టి మనకు రావలసిన ఆశీర్వాదములను కోల్పోయేలా చేస్తుంది. మన జీవితంలో పరిస్థితులు అన్నీ సొంత బలం పైన ఆనుకొనకుండా దేవుని బలాన్ని ఆనుకొని ఆయన మాటకు లోబడి నడుచుకొనుటకు నిర్ణయించు కుందాం. పరమతండ్రి మన కొరకు సిద్ధంగా ఉంచిన ఆశీర్వదములను సొంతం చేసుకొని విజయవంతమైన జీవితమును జీవిద్దాం. హల్లేలూయా!

- శ్రీమతి. జబఖని శేఖర్ గారు

 

ప్రార్థన అంశం:-

దేవుని కొరకు క్రియజరిగించే నలుగురు వ్యక్తులను ప్రతి సేవా స్థలంలో దేవుడు లేపి ఇచ్చులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al