Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.11.2022
Share:

By Village Missionary Movement

Monday, 07-Nov-2022

దిన ధ్యానము(Telugu) 08.11.2022

 

అంశం:- మనము.

 

"నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము" - కీర్తనలు 34:3

 

ఒక మానవ శాస్త్రవేత్త ఆఫ్రికన్ గిరిజన బాలుర కోసం పోటీ నిర్వహించారు. ఒక బుట్ట నిండా పండ్లను నింపి ఒక చెట్టు క్రింద ఉంచి అక్కడ నుండి ఒక వంద మీటర్ల దూరంలో ఆ బాలురను వరుసగా నిలబెట్టారు. ఎవరు మొదట ఆ చెట్టును దాటితే వారికి ఈ పండ్లు అన్ని బహుమతిగా ఇవ్వబడతాయి అని అన్నారు. సిద్ధంగా ఉన్న బాలురకు ఒక ఈల వేశారు. వారందరు ఒకరి చేయిని ఒకరు పట్టుకొని ఒకే సారి ఆ చెట్టును తాకి ఆ పండ్లను తీసుకొని పంచుకొని తినడం ప్రారంభించారు. 

 

ఈ సంఘటనను చూసిన మానవ శాస్త్రవేత్త ఎందుకు ఇలా చేశారు అని అడిగినప్పుడు అతనితో ఒకే సారి అందరూ కలిసి కలిసి కట్టుగా అన్నారు. దానికి అర్థం నేను అంటే నేను కాదు మేము అని అర్థం. ఇతరులు బాధ పడుతున్నప్పుడు ఒకరు మాత్రమే ఎలా సంతోషిస్తారు అన్నారు అంట. యెరూషలేము నుండి బబులోనుకు కొంత మంది యవ్వనస్తులను బానిసలుగా తీసుకొని రాబడ్డారు. అందులో దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ఈ నలుగురు వారు భుజించే ఆహారంలో కూడా అపవిత్రం చెందకూడదు అని ఐక్యముగ ప్రధాన అధిపతిని వేడుకున్నారు. వీరి కొరకు వేరుగా ఆహారం ఇవ్వబడింది. అది మాత్రమే కాదు నెబుకద్నెజరు కు వచ్చిన కలను మరియు దాని భావాన్ని చెప్పని వారికి మరణ శిక్ష అని ఆజ్ఞాపించినప్పుడు దానియేలు తన స్నేహితులతో కలిసి దేవుని యొక్క కనికరము కొరకు ప్రార్ధించారు. మన దేవుడు కలను మరియు దాని భావాన్ని తెలియజేసారు. రాజు యొద్ద తాను కనిన కలను మరియు దాని భావాన్ని చెప్పినప్పుడు దానియేలుకు అనేక దానములు ఇచ్చి అతనిని ప్రధానిగా నియమించారు. దానియేలు రాజును వేడుకోవడం వలన స్నేహితులు కూడా తనతో పాటు హెచ్చింప బడ్డారు.

 

అవును ప్రియమైన వారలారా! సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని కీర్తనలు 133 :1లో, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని 2 పేతురు 1:7లో వ్రాయబడి ఉన్నది. సహోదరులు మధ్య లేదా మన చుట్టూ వున్న వారి మధ్య ఏదైనా విభేదం ఏర్పడి నట్లైతే ప్రేమను మాత్రమే ఆయుధంగా చేసుకొనండి. కీడును మేలు చేత జయించుడి. సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను ప్రతిబింబింద్దాం. ఆమెన్.

- శ్రీమతి. మంజుల గారు

 

ప్రార్థన అంశం:-

మీడియా పరిచర్యకు అవసరమైన ల్యాప్ టాప్, కెమెరా, లైట్స్ కొనబడుటకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al