By Village Missionary Movement
Sunday, 06-Nov-2022దిన ధ్యానము(Telugu) 07.11.2022 (Youth Special)
అంశం:- రెక్కల నీడ
యూత్ స్పెషల్.
"ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది" - కీర్తనలు 91:4
ఒక ఇంటి ప్రక్కన ఉన్న తోటలో చిన్న చిన్న కోడిపిల్లలు మట్టి లో ఉన్న చిన్న చిన్న పురుగులను తింటూ ఉన్నాయి. హఠాత్తుగా తల్లి కోడి శబ్దం చేయడంతో కోడి పిల్లలు అన్ని వేగంగా వచ్చి తల్లి రెక్కల క్రింద దాక్కున్నాయి. దీనిని గమనిస్తున్న ఒకతను కారణం ఏమిటో తెలుసుకొనుటకు చుట్టూ చూసాడు. అప్పుడే తెలిసింది ఆకాశంలో గ్రద్ద కోడిపిల్లలను ఎత్తుకు పోవడానికి తిరుగుతూ ఉంది అని. తల్లి కోడి యొక్క ప్రేమను, ఆప్యాయతను చూసి ఆశ్చర్యపోయాడు.
ప్రియమైన యవ్వనులారా! మనం కూడా సంరక్షణ లేని లోకంలో జీవిస్తూ ఉన్నాము. విరోధి అయిన అపవాది ఎవరిని మ్రింగుదున అని తిరుగుచున్నాడు. పాపపు పోరాటములు, శోధనలు తప్పించుకోవడానికి మన అందరికి సంరక్షణ ఇచ్చే ఒకే ఒక స్థలం దేవుని రెక్కల నీడే. అపవాది యొక్క తంత్రములను తప్పించుకొనుటకు మనకు ఆశ్రయము, కేడెముగా ఉన్న స్థలం దేవుని సన్నిది మాత్రమే. ఈ దుష్ట లోక పాపముల నుండి తప్పించు కోవాలి అంటే ఆయన ప్రసన్నత చెంతకు రావాలి. చెడు స్నేహితుల ఆలోచనల నుండి తప్పించు కొనుటకు ఆయన పరిశుద్ధ గ్రంథ వాక్యమే మనకు సంరక్షణకరం. దేవుడు మరియు ఆయన వాక్యం మనతో లేనట్లు అయితే అది సంరక్షణ లేని జీవితం అవుతుంది.
దీనిని బాగా గ్రహించి కీర్తనాకారుడు 91వ కీర్తనలో ప్రభువు యొద్దనుండి వచ్చిన సంరక్షణను ఆశ్చర్యంతో వ్రాస్తున్నారు. మహోన్నతుని చాటు, సర్వశక్తుని నీడ, ఆయన రెక్కలు, ఆయనే ఆశ్రయం, దూతలకు ఆజ్ఞ, దుర్గం అని ఆయన మనలను కాపాడే మార్గములను ఎరిగి వ్రాస్తున్నారు. అవును యవ్వనులారా దేవుడు మనకు ఇచ్చేది శరీరానుసారమైన సంరక్షణ మాత్రమే కాదు మన ఆత్మీయ మనుష్యుని యొక్క మలిన రహితమైన జీవితం, సంరక్షణ, ఎదుగుదల అన్నీ ఆయనలో ఇమిడి ఉన్నవి. కాబట్టి ఈ పాపపు లోకంలో ఆయన రెక్కల క్రింద ఆశ్రయము పొందుకొని సంరక్షణ అనుభవించండి. హల్లేలూయా!
- శ్రీమతి. దివ్య ఫెర్నర్డ్
ప్రార్థన అంశం:-
యవ్వనస్తుల కొరకు జరుగుతున్న మీటింగ్ లో వాక్యం అందిస్తున్న దేవుని దాసులను దేవుడు మహిమ కరముగా వాడుకొనేలా ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250