By Village Missionary Movement
Thursday, 03-Nov-2022దిన ధ్యానము(Telugu) 03.11.2022
అంశం:- ధన్యుల యొక్క కీర్తన.
"భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము" - కీర్తనలు 84:10
పరిశుద్ధ గ్రంధంలో గల ప్రతి ఇక్క కీర్తనను మనం ధ్యానించి చూసినట్లయితే అనేక సత్యములను నేర్చుకోగలము. ఈరోజు మనం 84వ కీర్తనను ధ్యానిద్దాం. ఈ కీర్తనను పాడిన కీర్తన కారుడు ధన్యులు అనే పదాన్ని 3 సార్లు ఉపయోగించడం మనం చూస్తున్నాం. ఎవరు ధన్యులు అని తెలియజేసే ఈ కీర్తన కంఠత చేయ దగినది.
1.నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు (కీర్తనలు 84:4)
ఈ వాక్యం దేవుని సన్నిధిలో ఉన్న అనుభవాన్ని సూచిస్తుంది. దేవుని మందిరము అనగా ఆయన సన్నిధి. నిజముగా ఆసక్తితో ఆయన చెంతకు చేరి ఎల్లప్పుడూ ఆయనతో గడిపే అనిభావాన్ని పొందుకున్నాము అంటే మనము నిజముగా ధన్యులము. మనం ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు, దుస్తులు మడత బెడుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఆఫీసుకు వెళ్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతూనే ఉంటాం. ఆహా ఇది ఎంతటి ఆనందం.
2. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు (కీర్తనలు 84:5)
అనేకులు 40 సంవత్సరాలు వయస్సు వచ్చింది అంటే ఒక విధమైన బలహీనతకు గురి అవుతుంటారు. ఏదైనా వ్యాధి వచ్చేస్తుందేమో అని అప్పుడప్పుడు చెక్ చేసుకొంటుటారు. 60 సంవత్సరాలు వస్తే చాలు ఈ ప్రపంచం మనకు వృద్ధులు అని బిరుదు ఇచ్చేస్తుంది. అప్పటి వారు యవ్వన కాలంలో మేకప్ వేసుకున్నారో లేదో కాని ఇప్పుడు ఉన్న యవ్వనునికి ఇంకా యవ్వనంగా కనిపించుట కొరకు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. బలహీనం అవ్వకూడదు అని ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకొంటు ఉంటారు. మన యొక్క బలము మనము భుజించే పౌష్టిక ఆహారంలో లేదా బలము ఇచ్చే మాత్రలలో లేదా ఇంజెక్షన్ లో ఉండదు. మనకు బలము ఆయన వలన కలగాలి. మనకు బలము ఆయన వలన కలిగినప్పుడు ఉన్నతమైన బలము, ఉజ్జీవమును ఇచ్చే బలము మనలను నింపుటను మనం గ్రహించవచ్చు. హబక్కూకు ప్రవక్త చెప్పినట్లు ప్రభువగు యెహోవాయే నాకు బలము అని కేకలు వేద్దాం.
3. నీయందు నమ్మిక యుంచు వారు ధన్యులు. (కీర్తనలు 84:12)
అవును మన యొక్క నమ్మకం అంతయు దేవుని పైన ఉంచుదాం. 99% దేవున్ని నమ్ముతాను 1% మనుష్యు రీతిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పకుండా 100% కూడా ప్రభువగు యెహోవానే నమ్ముదాం ధన్యులు వలె ఈలోకంలో జీవిద్దాం. హల్లేలూయా!
- శ్రీమతి.జాబ డేవిడ్ గణేషన్ గారు.
ప్రార్థన అంశం:-
మన మిషనరీల యొక్క కుటుంబాలను దేవుడు సంరక్షించి వాడుకొని ఆశీర్వదించేలా ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250