Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.11.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 01-Nov-2022

దిన ధ్యానము(Telugu) 02.11.2022

 

అంశం:- కోరికలను నెరవేర్చు వాడు.

 

"మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును" - మత్తయి 10:32

 

ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిపైన జీవించిన కాలంలో చేసిన అనేక అద్బుతములను గూర్చి లేఖనాల్లో మనం చదువుతున్నాం. వాటిలో ఒకటి ఆయన ఎరికో నుండి వెల్లుచుండగా ఆయనను పిలిచిన ఇద్దరి గ్రుడ్డి వాళ్ళకు దృష్టి కలుగ జేయడం. ఈ సంఘటనను చదివినప్పుడు మనం ఒక విషయాన్ని గమనించ లేము. యేసు వారితో నేను మీకు ఏమి చేయ గోరుచున్నాను అని అడిగినప్పుడు వారు నడుచుకొంటు వస్తున్నప్పుడే వారు గ్రుడ్డివారు అని యేసు ఎరిగి యుంటారు. మరియు వారి కోరికను కూడా ఆయన ఎరిగి ఉంటారు. కాని వారికి ఈ ప్రశ్నను అడుగుతున్నారు. అవును ఆయన మన హృదయ వాంఛనలను నెరవేర్చు దేవుడు. ఆయన తన స్వార్థంతో మనలను నడిపించు వాడు కాడు. బదులుగా మన ఆలోచనలు ఆశలు ఎరిగి వాటికి బదులుగా మనలను ఆశీర్వదించాలి అని కోరుకున్న దేవుడు. 

 

అలాగే ఆయన అడిగిన ఈ ప్రశ్నకు గ్రుడ్డి వారు చెప్పిన జవాబు మనం గమనించ దగినది. వారు నమ్మకం లేకుండా ఏదో సరదాగా అడగకుండా వారి అవసరత ఏమిటో ఎరిగి దానిని గమనించి వారు మా కన్నులు తెరువు వలెను అని అడిగారు. వారు దేవున్ని పరీక్షించ కుండా జాగ్రత్తగా ఉన్నారు. కాని మనం అనేక సమయాల్లో మన జీవితంలో దేవునికి ఇష్టం లేని మరియు మనకు అవసరం లేని వాటి కొరకు ప్రార్ధనలో దేవున్ని పరీక్షిస్తూ ఉంటాము. ఈ గ్రుడ్డి వారు అవసరతను ఎరిగి అద్బుతమును పొందుకున్నారు. వారి జీవితంలో ఉన్న చీకటి తొలగి వెలుగు కలిగింది.

 

ఈనాడు మనము కూడా అనేక సమయాల్లో కళ్ళు మూసుకొని ఉన్న గ్రుడ్డి వాని వలె దేవున్ని ఎరుగని వాని వలె ఉంటున్నాం. పాపం, వ్యాధి, అహంకారం వంటి అనేకమైన చీకట్లు మనలను మూసి ఉన్నాయి. కాని ఆ చీకటిని గమనించ కుండా పరితాపం చెందే స్థితిలో మన జీవితాలు సాగుతున్నాయి. మనం చీకటిలో ఉన్నాం అనే విషయాన్ని కూడా గ్రహించ కుండా అపవాది మన ఆత్మీయ కన్నులకు గ్రుడ్డి తనం కలుగజేసేశాడు. కాబట్టి మొదట మన చుట్టూ ఉన్న చీకటిని గ్రహించి అవసరమైనది ఏమిటి అని తెలివిగా ఎరిగి యేసుక్రీస్తు చెంతకు వచ్చిన గ్రుడ్డి వారి వలె దేవుని సన్నిధిలో ఆటంకములను పట్టించుకోకుండా నిజముగా దేవున్ని అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు మన వాంఛలను నెరవేర్చుతాడు. హల్లెలుయా!

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు.

 

ప్రార్థన అంశం:-

మన మిషనరీల ద్వారా దేశంలో దేవుడు గొప్ప ఉజ్జీవమును కలిగించేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet