Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.10.2022
Share:

By Village Missionary Movement

Thursday, 27-Oct-2022

దిన ధ్యానము(Telugu) 28.10.2022

 

అంశం:- దేవుని తలంపులు.

 

"నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు" - యెషయా 55: 8

 

అల్బార్ట్ ఆయిన్ స్టెయిన్ కొరకు తెలియని వారు ఎవరు ఉండరు. అతడు గణిత నైపుణ్య కలిగిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. కాని అతని యవ్వనం గురించి మనం చదివినప్పుడు అతడు వేగంగా ఏమియు నేర్చుకోలేడు అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా థామస్ అల్వా ఎడిషన్ అనే శాస్త్రవేత్త జీవితాన్ని వెనక్కు తిరిగి చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. చిన్నప్పటి నుండి అతనికి వినికిడి శక్తి చాలా తక్కువగా ఉండేది. అంతే కాదు స్కూల్లో అతని టీచర్ బ్రెయిన్ డిస్ ఆర్డర్ అనే చెప్పి చదువు మధ్యలోనే అతనిని బయటకు పంపి వేశారు. ఆ తరువాత ఇంట్లోనే తన తల్లి వద్ద చదువును నేర్చుకున్నాడు. ఇటువంటి ఇంకొక వ్యక్తి అబ్రహం లింకన్ ఈయన అమెరికా అధ్యక్షుడుగా మనకు తెలుసు. కాని తన జీవితంలో ఎన్నో అపజయాలు రుచి చూసారు. 1826లో డిప్రెషన్ తో బాధ పడి 6 నెలలు మంచాన్న పడ్డారు. ఆ తరువాత 3 సార్లు రాజకీయ పదవులకు పోటీ చేసి విఫలం అయ్యారు. చివరికి అతని ప్రయత్నం యునైటెడ్ స్టేట్స్ కి అతనిని అధ్యక్షుడు గా చేసింది.

 

ప్రియమైన వారలారా సాధకులు జాబితాను పరిశీలన చేస్తే ఓడిపోయి సాధించిన వారు ఎందరో. యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరికి ప్రతిభను ఇచ్చారు. దీనిని చెప్తున్న నేను కూడా బాగా చదివి పైకి ఎదగాలి అనుకున్నాను. కాని ప్రభువు యొక్క ప్రణాళిక నాతో భిన్నంగా వ్యవహరించింది. నేను ప్రభువుకు మొఱ్ఱపెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. కాని ప్రభువు ఆ సమయంలో మౌనముగా ఉన్నారు. కష్టాల దారి గుండా నడిచినప్పుడు నేను దేవున్ని ప్రశ్నిద్దాం అనుకున్నాను. కాని గర్భంలో నేను నిన్ను రూపించక మునుపే నేను నిన్ను ఎరిగితిని అని వాగ్దానం చేసిన దేవుడు అనేక ఆశీర్వాదములతో నన్ను వాడుకొంటున్నారు. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మును కూడా వాడుకొంటారు. 

 

కాబట్టి అపజయాలు చూసి కృంగి పోకుండా దేవుని పైన భారాన్ని వేసి ఆయన ఇచ్చే శక్తితో పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అది కచ్చితంగా దేవుని తలంపులను నెరవేర్చుతోంది. ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తి ఆయన చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఆశీర్వదాలు పొందుకుందాం. ఆమెన్.

- శ్రీమతి. జ్ఞాన సెల్వం సెల్వరాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి రోజు టీ. వి లో ప్రసారం చేయబడుతున్న కార్యక్రమాల ద్వారా సంధింపబడుతున్న వ్యక్తులు దేవుని ప్రేమలో ఎదిగేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal milanobet bahiscasino betpas bahiscasino atlasbet matbet pusulabet bahiscasino celtabet betplay