Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.10.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 25-Oct-2022

దిన ధ్యానము(Telugu) 26.10.2022

 

అంశం:- ముందుకు సాగు.

 

"శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు" - సామెతలు 24:10

 

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా కళాశాలలకు మధ్య క్రీడా పోటీ జరుగుతూ ఉంటాయి. చరిత్రలో 252 మ్యాచ్ లు గెలిచిన ట్రినిటి కాలేజ్ చాలా కాలం తరువాత 2012 సంవత్సరం జనవరి 18వ తేదీన ఎల్ యూనివర్సిటీతో జరిగిన స్క్వాష్ మ్యాచ్ లో ఓడిపోయింది. ఆ జట్టు కోచ్ అయిన పాల్ ఏసీ యాంటీన్ మరియు ఒక ప్రసిద్ధి గాంచిన ఫూట్ బాల్ కోచ్ మరల మంచిగా లేవండి అనే మూడు పదాలు గల వార్తను పంపించారు. మనం అందరం విఫలం అయినప్పుడు మరల తిరిగి లేవాలి. బదులుగా మానసిక అలసటతో ఆగిపోకూడదు. జీవితంలో అపజయాన్ని చూడని వారు దానిని సంధించి నప్పుడు నిరాశతో అదృశ్యం అవుతున్నారు. 

 

1 రాజుల గ్రంధంలో యెజెబేలు పంపిన వర్తమానం వలన బయపడి ఇంత మట్టుకు చాలును అని వెనుదిరిగాడు ఏలీయా. కాని యెహోవా నీవు లేచి భోజనం చేయుము శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై యున్నది అన్నారు. మన యొక్క అంచనాలకు విరుద్ధంగా ఊహించని కార్యాలు మన జీవితంలో వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయాలు మన జీవితంలో తీసుకొంటూ ఉంటాం. కాని వాటికి చోటివ్వకుండా వాక్యం ఏం చెబుతోంది అని నిదానంగా తెలుసుకోవాలి. మనం అలసిపోవడం లేదా వెనుదిరగడం వంటి వాటిని పరిశుద్ధ గ్రంధం ఎన్నడు అంగీకరించలేదు బదులుగా కొంచం పరిశోధించి పరిగెడుతూనే ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. 

 

హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును అని చదువుతున్నాం. మరియు మనము నశించుటకు వెనుకతీయు వారముకాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమైయున్నాము అని కూడా వ్రాయబడి ఉన్నది. క్రీస్తులో ప్రియమైన వారలారా ఈనాటి వాక్యములో శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేతకాని వాడవు అగుదువు అని విన్నాం. సమస్యలు, అపజయాలు, మోసాలు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంధం పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రభువు మీకు సహాయం చేస్తారు. మీ పనులు, ప్రయాణాలు ఆటంకం లేకుండా ఉండును గాక!

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

మనం చేస్తున్న సువార్త పత్రికల పరిచర్య మూలముగా సంధింప బడుతున్న వ్యక్తుల హృదయంలో ప్రభువు క్రియ జరిగించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al