By Village Missionary Movement
Monday, 24-Oct-2022దిన ధ్యానము(Telugu) 24.10.2022 (Youth Special)
అంశం:- తండ్రి యొక్క ప్రేమ
" నీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా" - మత్తయి 9:6
ప్రియమైన యవ్వనులారా నేను మీకు ఒక కధ చెప్పాలని ఆశపడున్నాను. ఒక గ్రామంలో మేరి అనే యవ్వన బాలిక ఉండేది. ఆమెకు అమ్మ లేకపోవడంతో తన తండ్రి చాలా ఎక్కువగా ప్రేమించేవాడు ఆమె ఉన్నత చదువుల కొరకు వేరే రాష్ట్రానికి వెళ్ళింది. అక్కడ ఉన్న తప్పుడు స్నేహితుల వలన తప్పుడు వలలో చిక్కుకుంది. తండ్రికి అబద్ధం చెప్పి ఎక్కువ డబ్బును తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంకా హాస్టల్ ల్లో ఉండకుండా, కాలేజ్ కి వెళ్ళకుండా బయట తిరగడం మొదలు పెట్టింది. ఈ సంగతి తన తండ్రి కి తెలియజేయబడలేదు. కొన్నిరోజుల తరువాత మేరి యొద్ద డబ్బు లేదని ఎరిగి తన స్నేహితులు తనను విడిచిపెట్టేసారు. ఇప్పుడు మేరి తన స్థితిని ఎరిగి మిక్కిలి బాధతో దేవుని యొద్ద క్షమాపణ అడిగింది. ఇంకా తన తండ్రి కి కూడా ఒక ఉత్తరం రాసి క్షమాపణ అడిగింది. తన తండ్రి తనను ఎంతో ప్రేమతో క్షమించి అంగీకరించారు.
పరిశుద్ద గ్రంధంలో యేసుక్రీస్తు ఇలాంటి ఉపమానం యేసుక్రీస్తు చెప్పారు. లూకా సువార్త15:12 లో చిన్నకుమారుని యొక్క ఉపమానమును చదువుతున్నాం. తను తన తండ్రి యొద్ద ఆస్థిని తీసుకొని దుర్మార్గముగా జీవించుటకు దూర దేశమునకు వెళ్ళాడు. అక్కడ తన ఆస్థిని ఖర్చు చేసి ఒంటరి అయిపోయాడు. అప్పుడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని అక్కడ కూలి వాళ్ళ కు అన్నము సంభృద్ధిగా ఉన్నది నేను అక్కడకు మరలా తిరిగి వెళ్తాను అని అనుకున్నాడు. కాని తన తండ్రి ని చూసి హత్తుకొని ప్రశస్త వస్త్రము ధరింపజేశాడు విందును సిద్ధపరిచి అతని రాకను ఘనముగా జరుపుకున్నాడు.
ప్రియమైన యవ్వన తమ్ముడు, చెల్లెల్లారా! మారుమనస్సు పొంది ప్రతి పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది. ఇంకా లోకపు ఆశలతో చిక్కుకొని చెడు స్వభావముతో పోరాడుతున్న ప్రతి ఒక్క యవ్వనులకు దేవుడు చెబుతున్న వార్త ఇది. ఆయన పాపమును ద్వేషించువాడు, కాని పాపులను ప్రేమిస్తున్నాడు. మన కొరకు సిలువలో తన స్వంత రక్తమును చిందించి మనలను రక్షించారు. భూమిపై మనుష్యుల పాపములను క్షమించే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీ పాపములను గ్రహించి దేవుని యొద్ద ఒప్పుకున్నప్పుడు ఆయన మిమ్ములను క్షమించి ఆ పాపము నుండి విడిపించే శక్తి మంతుడై యున్నాడు. కాబట్టి దేవుని యొద్ద మీ జీవితమును సమర్పించుకొనండి ఆయన మిమ్మును రక్షిస్తారు. హల్లేలూయా!
- శ్రీమతి. షీలా జాన్
ప్రార్థనా అంశం:-
మనతో కలిసి పరిచర్య చేస్తున్న తోటి సేవకుల కొరకు ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250