Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.10.2022
Share:

By Village Missionary Movement

Friday, 21-Oct-2022

దిన ధ్యానము(Telugu) 21.10.2022

 

అంశం:- ఘనత వహించిన కాపలా దారి.

 

"నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహ మంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండవలెను" - యెహేజ్కేలు 38:7

 

1989 వ సంవత్సరంలో భారతదేశ సరిహద్దుల్లో గల లడ్డాక్ ల హాట్ స్పీరింగ్ వద్ద 10 మంది ధైర్యవంతులైన పోలీసులపై మెరుపు దాడి చేసిన చైనా సైన్యం సంఖ్య బలము లేని సైనికులను హత మార్చింది. ఈ పది మంది పోలీసులకు జ్ఞాపకార్దముగా అక్టోబర్ 21వ తేదీన పోలీసుల సంస్మరణ దినోత్సవం గా జరుపుకొంటు వస్తున్నాం. 2017వ సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం స్వతంత్రము పొందుకున్న అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 34844 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు అని లెక్కించడం జరిగింది. వారందరిని జ్ఞాపకం చేసుకోనుట పరాక్రమము గల గోడ అని 30 అడుగుల గ్రానెట్ శిలా పలకాన్ని న్యూ ఢిల్లీలో మనం చూడ వచ్చు. ఇది మాత్రమే కాదు పేరు చెప్పబడని అనేక గోడలు సైనికులు తాము జీవించే రోజుల్లో, పని చేసే సమయాల్లో ఆకలిని, దాహమును, నిద్రను మరచి ప్రజల సంరక్షణ కొరకు వారి జీవితం త్యాగం చేసిన వారి కొరకు కట్టబడ్డాయి. ఈనాడు వారందరిని జ్ఞాపకం చేసుకొంటు దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలుపుదాం. 

 

పరిశుద్ధ గ్రంధంలో కూడా మొర్దేకై అనే ద్వార పాలకుడు రాజు ప్రాణమును కాపాడుటను యూదులను నాశనము నుండి కాపాడుటకు పోరాడి విజయం పొందుకొనుటను మనం ఎరిగి యున్నాము. నెహెమ్యా యెరూషలేము ప్రకారము కట్టుటకు రాత్రి, పగలు కాపలా కాసాము. వస్త్రములు ఉతుకు కొనుటకు తప్ప మరి దేనికిని తీసివేయలేదు. ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడే వరకు ఈటెల పట్టుకున్నాము. ఒక చేతితో పని చేసి ఇంకొక చేతితో ఈటెను పట్టుకొని కాపలా కాసాము అని తన సొంత దేశము కొరకు సమర్పణతో పనిచేయడం మనం చదువుతున్నాం. ఇవన్నియు మన హృదయంలో దేశం కొరకు పట్టుదలను కలుగ జేస్తున్నాయి.

 

ప్రియమైన వారలారా! ఈవిధంగా తమ దేశాల కొరకు త్యాగం చేసిన వారి జాబితా చరిత్రలో ఉంది. అన్నింటి కంటే పైగా లోకం అంతటి కొరకు యేసుక్రీస్తు సిలువలో త్యాగబలి అయ్యారు. ఇంకా సువార్త నిమిత్తముగా ఎంతో మంది హత సాక్షులుగా మరణించారు. ఇలా హత సాక్షిగా మరణించే పిలుపు మనందరికీ లేకపోయిన దేశానికి కాపలాగ ఉండే పిలుపుకు మనలను పిలుచుకున్నారు. మనం సిద్ధపడి మనతో కూడా ఒక గుంపును సిద్ధం చేద్దాం. మరి దేశం కొరకు మీరు సిద్ధమా!

- శ్రీమతి. మంజులా గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రార్థన గుంపు నాయకుల కొరకు బయలుపరుస్తున్న పత్రికలు ప్రింట్ చేయటానికి కావలసిన అవసరతలు సంధింపబడేలా ప్రార్థిద్ధాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al