By Village Missionary Movement
Thursday, 20-Oct-2022దిన ధ్యానము(Telugu) 20.10.2022
అంశం:- వదులుకుందాం.
"నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడ మతట్టునకును వెళ్లుదును" - ఆదికాండము 13:9
వార్తా పత్రికలో చదివిన ఒక సంఘటన. ఒకరు తాను నివసించడానికి ఇల్లు కట్టుటకు అన్ని పనులు చూసుకొంటున్నారు. అనుకోకుండా తన సమీపంలో ఉన్న మరొకరి భూమిలో 6 అంగుళాలు ఎక్కువ కొలిచేసాడు. పొరుగు భూమి యజమానికి కోపం వచ్చి గొడవ పెరిగి అది పెద్ద పగ వలె మారింది. ఇద్దరికి రాజీ కుదరలేదు. ఒక రోజు ఇల్లు కట్టుకొంటున్న యజమానిని పొరుగు భూమి యొక్క యజమానుడు హత్య చేశాడు. అయితే ఆ హత్య చేసిన వ్యక్తి జైల్లో వేయబడ్డాడు. ఇద్దరు కూర్చొని పరిష్కరించవలసిన విషయం అంతటితో ముగిసింది.
పరిశుద్ధ గ్రంధంలో అబ్రాహాము ఒక మంచి ఉదాహరణ. అబ్రాహాము మరియు తన సోదరుడు కుమారుడైన లోతుకు చాలా ఆస్తులు ఉన్నాయి అని మనం చూస్తాము. ఒకనొక సందర్భంలో అబ్రాహాము యొక్క గొర్రెల కాపరులకు మరియు లోతు యొక్క గొర్రెల కాపరులకు ఉండవలసిన స్థలం గురించి గొడవ జరుగుతుంది. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రాహాము చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడవచ్చు. అబ్రాహాము లోతుతో ఇలా చెప్పాడు. నీవు ఎడమ తట్టుకు వెళ్లిన యెడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్లిన యెడల నేను ఎడమ తట్టుకును వెళ్లెదను అని చెప్పారు. అలా వదులు కోవడం వలన అబ్రాహాముకు ఏ లోటు లేదు. దేవుడు అబ్రాహామును మరింత ఎక్కువగా ఆశీర్వదించారు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! నేటి ప్రపంచంలో ట్రెండ్ చెడ్డగా ఉన్నది. ఇలా వదులు కోవాల్సిన గుణం చాలా మందికి లేదు. కాబట్టి క్రీస్తును ఎరిగిన మనం మన కుటుంబ సంబందులలో నైనా పని చేయుచున్న స్థలంలోనైన లేకపోతే పరిచర్యలోనైన మనలను మనం వదులు కోవాలి. ఈ గుణం మనలో ఉంటే మనం చాలా మందికి దీవెన కరముగా ఉంటాము. స్వార్దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పరిగెత్తే వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కాని మనం ఇతరుల కొరకు వదులుకొనేవారిగా జీవిస్తే చాలా మంది మన ద్వారా దేవున్ని తెలుసుకోవచ్చు. హల్లేలూయా!
- బ్రదర్. టి. శంకర్ రాజ్ గారు.
ప్రార్థన అంశం:-
రెండు నెలలకు ఒకసారి సేవకుల కొరకు ప్రచురిస్తున్న పత్రిక ద్వారా వారి యొక్క ప్రణాళిక నూతన పరచబడు లాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250