Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.10.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 18-Oct-2022

దిన ధ్యానము(Telugu) 19.10.2022

 

అంశం:- ఇదియు అదియు ఉంటే.

 

"విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?" - యాకోబు 2:22

 

ఒక పేద చాకలి వాడి దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. అతనికి చాలా పనులు ఉండేవి. ఆ గాడిద ఆ పనులు అన్నింటిలో అతనికి చాలా సహాయం చేసేది. ఒక రోజు నీటి కోసం తవ్విన బావిలో ఆ గాడిద పడిపోయింది. ఆ చాకలి వాడు దానిని చాలా చోట్ల వెతికి వెతికి చివరిగా ఆ బావిలో పడి ఉండుటను చూసి చాలా బాధపడ్డాడు. అతనికి ఏం చెయ్యాలో తెలియక ఆ బావిలో మట్టి వేసి ఆ గాడిదను కప్పి పెట్టి తాను వేరే పని చేసి బ్రతక వచ్చు అనుకున్నాడు. కాని గాడిద మాత్రం నా యజమానుడు వచ్చేసాడు నన్ను ఎలాగైనా కాపాడతాడు అనుకొని సంతోషించింది. ఆ గాడిద ఆలోచిస్తూ ఉండగా తన పైన మన్ను పడింది. చాకలి వాడు వేసిన మన్ను దులుపుకొని ఆ మన్ను పైన ఎక్కి అక్కడ అక్కడ ఉన్న రాళ్ళను ఆధారంగా చేసుకొని బయటకు వచ్చి తిరిగి ఆ చాకలి వాడి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ చాకలి వాడికి గాడిద నేర్పిన పాఠం చూసారా! ఉన్న వాటితో ప్రయత్నం చేసి ముందుకు సాగాలి అని చెప్తూనే ఇంటికి వెళ్ళిపోయాడు చాకలి వాడు. 

 

మనకు దేవుని యందు విశ్వాసం ఉంది మనం సోమరి వలె అబ్రహాము బలిని అర్పించడానికి పొట్టేలు ఇచ్చిన దేవుడు మనకు ఇస్తాడు అని ముందుకు సాగకుండా ఆగిపోతున్నాం. ఏలియాను చూడండి అతనిని కాకి పోషించింది కదా అని మాట్లాడుతు మోసపోతున్నాం. తన కుమారుడ్ని మోరియా దేశంలో గల పర్వతములలో ఒక దాని మీద తన కుమారుడ్ని బలిగా అర్పించమని యెహోవా చెప్పినప్పుడు అబ్రాహాము తన భార్యతో కూడా చెప్పకుండా పని జరిగించుట మొదలు పెట్టాడు. తెల్లవారుజామున లేచి తన కుమారుడ్ని బలి అర్పించుటకు తీసుకువెళ్లాడు. ఎందుకు అనగా ఎవరి ద్వారా కూడా దేవుని ప్రణాళికా ఆటంకపరచ బడకూడదు అనేదే అతని ఉద్దేశం. 

 

ప్రియమైన వారలారా! విశ్వాసంలో దైర్యంగా ప్రవర్తించిన అబ్రాహాము తన యొక్క వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడ్ని దేవుని కొరకు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే దాని కంటే ఉన్నత మైన విధేయత ఏదైనా ఉందా ? తన కుమారుడ్ని తీసుకొని వెళ్తున్నప్పుడు తన కుమారుడ్ని బందించినప్పుడు బలి పీఠం మీద కట్టెలను పేర్చినప్పుడు ఆ కట్టెల పైన ఉన్న తన కుమారుడ్ని బలిగా అర్పించుటకు తన చేయి చాపే వరకు తన కుమారుడ్ని బలి అర్పించాలి అనే ఆలోచన మాత్రమే తనలో ఉంది. మనుష్యునిగా పుట్టిన అబ్రాహాము తన సొంత కుమారుడ్ని కోల్పోవుటకు సిద్ధంగా ఉంటే మరి మన పరమతండ్రి తన సొంత కుమారుడ్ని మన కొరకు మరణానికి అప్పగించడం అనేది ఎంతటి సత్యం. మనం మన క్రియల ద్వారా విశ్వాసం కపాడుకొనుటకు దేనిని కోల్పోవుటకు సిద్ధంగా ఉన్నాం ఆలోచిద్దామా? మన యొద్ద ఉన్న దానితో ప్రయత్నం చేసి మన కొరకు దేవుడు ఏర్పరిచిన దానిని పొందుకోనుటకు ప్రయాస పడదాం. 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

 

ప్రార్థన అంశం:-

చైన్ ప్రేయర్ లో పాల్గొని ఉన్న ప్రార్థనా వీరులను దేవుడు ఏలీయా ఆత్మతో నింపేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al