Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.10.2022
Share:

By Village Missionary Movement

Monday, 17-Oct-2022

దిన ధ్యానము(Telugu) 18.10.2022

 

అంశం:- ఇది జరుగునా? 

 

"యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా" – 2 రాజులు 7:2

 

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక సంఘ విశ్వాసి వారి పై అధికారి అన్యాయంగా నడుచుకొంటున్నారు అని పై అధికారులకు ఫిర్యాదులు చేసాడు. అందువలన ఉద్యోగం పోతుంది అని వారికి అనిపించింది. వెంటనే వారు బయపడి పాస్టర్ గారిని వేడుకున్నారు. దీనికోసం పాస్టర్ మరియు చర్చ్ విశ్వాసులు అందరూ ప్రార్ధించారు. దీనిని విచారించడానికి కార్యాలయం నుండి ఇద్దరు అధికారులు వచ్చారు. వారికి మనస్సులో దేవుడు మాట్లాడినట్లు ఆ విశ్వాసిపట్ల క్రూరముగా ప్రవర్తించిన ఆ అధికారి తప్పు నాదే అని వ్రాసి పంపించారు. ఆ అధికారికి ట్రాన్స్ఫర్ వచ్చింది. అంతే కాకుండా ఆ విశ్వాసికి పై పదవి కూడా ఇచ్చారు. అవును ఇలా జరుగునా ఇది సాధ్యమా అని మనుష్యుల ఆలోచన ప్రకారం ఆలోచించే విధానంలో దేవుడు మన కోసం యుద్ధం చేసి జయాన్ని ఇచ్చే వారి వలె ఉన్నారు. 

 

పరిశుద్ధ గ్రంధంలో సిరియా రాజు ఇశ్రాయేలీయుల ముఖ్య నగరం అయిన సమరియను ముట్టడి వేసాడు. సమరయలో భయంకరమైన కరువు వచ్చింది. ఇశ్రాయేలు రాజు కలవరపడి ప్రవక్తను పిలిపించారు. అక్కడ ఎలీషా రేపు సమరయలో ద్వారా మందు రూపాయి ఒకటింటికీ ఒక మానిక సన్నని పిండియు మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యావలు ను అమ్మబడును అని చెప్పారు. అది విన్న రాజు యొక్క ప్రధాని యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఆలాగు జరుగునా అని అనుమానంతో అడిగి ఇశ్రాయేలీయుల దేవున్ని సందేహించాడు. కాని జరిగింది ఏమిటో తెలుసా? ప్రభువు సిరియనుల యొక్క సైన్యమునకు గొప్ప శబ్దం వినిపింప జేశాడు. దానిని విని వారు ఇతర రాజులు ఇశ్రాయేలీయులకు మద్దతుగా వస్తున్నారు అని భావించి అప్రమత్తమైన సిరియా సైన్యం పారిపోయారు. ఎలీషా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన విధముగా పరిస్థితులు మారాయి. 

 

ప్రియమైన వారలారా! మీ యొక్క జీవితంలో ఇది జరుగునా అనే ప్రశ్న ఉన్నదా? ఒక కార్యాన్ని దేవుడు మీకు వాగ్దానం చేసినా సరే ఆ ప్రధాని వలె విశ్వాసం ఉంచలేకపోతున్నారా? దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు. శోధించలేని గొప్ప పనులు లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు పైన చెప్పబడిన విశ్వాసి జీవితంలో చేసినట్లే గొప్ప కార్యములు చేయును గాక! విశ్వాసం ఉంచండి. ఆమెన్!

- సిస్టర్. ఏ. బ్యూలా.

 

ప్రార్థన అంశం:-

మన గెత్సేమనే క్యాంపస్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రోజు ఉదయం 11 నుండి 1 గంట వరకు జరుగుతున్న స్వస్థత నిచ్చు ఆరాధనకు వస్తున్న వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుకోను లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al