Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.02.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 14-Feb-2021

దిన ధ్యానము(Telugu) 14.02.2021 (Kids Special)

ప్రత్యేకంగా చిన్న పిల్లలు కోసం.

మారని ప్రేమ.

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" - యోహాను 3: 16

రేయ్ వెయిట్ చెయ్యు ఇదిగో ఈ చాక్లెట్టు అంత నీకే అన్నాడు మహేష్. ఎలా రా నీకు ఇంత విలువైన చాక్లెట్ దొరికింది అని అడిగాడు ప్రభు. నిన్న మా నాన్న ఫారిన్ నుండి వచ్చారు ఆయన తెచ్చిన ఈ చాక్లెట్లు నీకు ఇవ్వకుండా తినడానికి నాకు మనస్సు రాలేదు అందుకే మొదట నీకు తీసుకొని వచ్చాను అని అన్నాడు మహేష్. నా మీద మహేష్ కు ఇంత ప్రేమ అని మనస్సులో అనుకున్నాడు ప్రభు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులు, పసి ప్రాయంలోనే కలిసి చదువుకొని, ఒకే వీధిలో ఉండుట వలన వీళ్లిద్దరూ మంచి స్నేహితులు అని అందరికి తెలుసు. ఆ వీధిలో ఉన్న వాళ్లంతా స్నేహితులు అంటే మహేష్ ప్రభు వలె ఉండాలి గొడవ పడకుండా ఎంత ప్రేమగా వుంటున్నారో చూడండి అని మెచ్చుకొనే వారు. అందువలన వాళ్ళ యొక్క స్నేహం ఇంకా దృడంగా మారింది. 

ఒక రోజు వాళ్ళ గ్రామంనకు పక్కనే గల అడవికి వాకింగ్ కు వెళ్ళాలి అని ఇద్దరు నిర్ణయించుకొన్నారు. ఇద్దరు కలసి మాట్లాడుతూ అడవిలోనికి వెళ్తూవున్నారు. హఠాత్తుగా ఒక శబ్దం వచ్చింది. అది ఎలుగుబంటి ఆయి ఉంటుందా అని ఆలోచించేలోపే ఎలుగుబంటి వాళ్ళకి ఎదురుగా వచ్చింది. మహేష్ కి చెట్టు ఎక్కడం వచ్చు కాని ప్రభు కి చెట్టు ఎక్కడం రాక బయపడి పోయాడు. అరేయ్ మహేష్ నన్ను ప్రాణంకన్న ఎక్కువగా ప్రేమిస్తాను అని. చెబుతావుగ మరి నన్ను కూడా చెట్టు ఎక్కించు అని కేక వేసాడు. అయ్యయ్యో నా వల్ల కాదు బాబు అని పరిగెత్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు మహేష్. ఏదో తనకి గుర్తుకు వచ్చి ప్రభు క్రింద పడి చచ్చిన వాడి వలె ఊపిరి పీల్చుకోకుండా పడుకున్నాడు. ఎలుగుబంటి వచ్చి ప్రభు మొఖం పైన వాసన చూసి ఎలుగుబంటి చనిపోయిన దానిని తినదు కాబట్టి ఆలాగు ప్రభు ను వదిలి వెళ్ళిపోయింది. ప్రాణమునకు హాని అన్న వెంటనే మహేష్ నన్ను మర్చిపోయాడే స్నేహితుని ప్రేమకు పరిమితి ఉంది అని ప్రభు ఆ దినము గ్రహించుకున్నాడు. కిందకు దిగిన మహేష్ అరేయ్ ప్రభు ఎలుగుబంటి ని చెవిలో ఏదో చెప్పింది కదా ఏమి చెప్పిందిరా అని అడిగాడు మహేష్. నిలాంటి స్నేహితుని నమ్మవద్దని ఆయన ప్రేమ మారిపోతుంది అని చెప్పింది అన్నాడు. అవును మారని ప్రేమ, పరిమితి లేని ప్రేమ యేసు ప్రేమ మాత్రమే.

అవును తమ్ముడు, చెల్లి నిన్ను ప్రాణాంకన్న ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పేవారి మాటలు నమ్మి మోసపోకు. నికొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య ప్రేమను తలంచుకొనుము. ఆయన ప్రేమ ఎన్నడు మారనిది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమించి నీకు సహాయం చేయడానికి ఆయన వాంఛతో ఉన్నారు. ఆయన ప్రేమను నీవు దృఢముగా నమ్మవచ్చు. ఓకేనా!
-    శ్రీమతి. జీవా విజయ్

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş